English | Telugu

"నాట్ అవుట్ నాగరాజు"...సినిమా చూడండన్నా...ఏడుస్తూ బతిమాలుకున్న భాస్కర్!

సయ్యద్ సోహైల్ రీసెంట్ చేసిన మూవీ "బూట్ కట్ బాలరాజు"..ఈ మూవీ ప్రమోషన్స్ ని సోహైల్ ఎలా చేసాడో అందరికీ తెలుసు. ఎందుకంటే ఏడుస్తూ థియేటర్స్ లో చూడండి...ఇక్కడ అందరూ సూపర్ అంటారు థియేటర్ కి మాత్రం ఎవ్వరూ వెళ్ళరు అంటూ ఏడ్చినా వీడియోస్ కూడా మనకు కనిపిస్తాయి. అదే కాన్సెప్ట్ ని ఇప్పుడు ఎక్స్ట్రా జబర్దస్త్ షోలో బులెట్ భాస్కర్ స్పూఫ్ గా చేసి చూపించాడు. "నాట్ అవుట్ నాగరాజు" పేరుతో బ్యానర్ ఒకటి పెట్టి స్కిట్ ని పెర్ఫార్మ్ చేసాడు.

మూవీ రిలీజ్ కాకముందు జిగేల్ డ్రెస్సులతో మురిపించి కాలు మీద కాలేసుకుని సిగరేట్ తాగుతూ మంచి ఆటిట్యూడ్ చూపించిన భాస్కర్ మూవీ రిలీజ్ తర్వాత డల్ గా ఐపోయి ఏడుస్తూ హంగామా క్రియేట్ చేసాడు. "చూడండన్నా సినిమాని థియేటర్ కి వచ్చి. రివ్యువర్లకు ఒకటే చెప్తున్నా.

ఇంకా నా సినిమా లోపల స్టార్ట్ కాలేదు...జస్ట్ ముఖేష్ యాడ్ వచ్చింది ఆడెవాడో రివ్యూ పెట్టాడు. ముఖేష్ యాడ్ చూసి రివ్యూ పెట్టడమేంటన్నా..జబర్దస్త్ ప్రోమో కింద కామెంట్స్ పెట్టారు కదరా...జై భాస్కర్ అని రాయలసీమ వాళ్ళు వెళ్లి సినిమా చూడండన్నా భీమవరం వాళ్ళు చూడండన్నా..ఐనా మీకు ఇలాంటి సినిమాలు నచ్చవన్నా..." అంటూ ఏడ్చేసారికి నాటీ నరేష్ వచ్చి భాస్కర్ కన్నీళ్లు తుడిచి బాధపడకు నీ సినిమా చూస్తారులే అని ఓదార్చాడు. బులెట్ భాస్కర్ ఈమధ్య కొన్ని స్పూఫ్స్ అద్భుతంగా చేస్తున్నాడు. ఐతే అటు జబర్దస్త్ లో, ఇటు ఎక్స్ట్రా జబర్దస్త్ లో కూడా కామెడీ కంటెంట్ తగ్గిపోతూ ఇలా ఇమిటేషన్ కంటెంట్ తో నెట్టుకొస్తున్నారు. ఐతే జడ్జ్ కుష్బూ కామెంట్స్ కి గతంలో ప్రసారమైన ఎపిసోడ్ లో గుండు కొట్టించేసుకున్నాడు. ఇప్పుడు ఇంకా జుట్టు రాకపోవడంతో రకరకాల విగ్గులు పెట్టుకొస్తూ స్కిట్స్ ని మేనేజ్ చేస్తున్నాడు.