English | Telugu
అమ్మా తల్లి..నేను మీ కార్తీక దీపం డాక్టర్ బాబుని కాను!
Updated : Mar 12, 2024
ఢీ సెలబ్రిటీ షో నెక్స్ట్ వీక్ ప్రోమో మంచి కలర్ ఫుల్ గా ఉంది. ఈ షో థీమ్ వచ్చేసి సీజన్స్ స్పెషల్ అన్నమాట. సీజన్స్ ఎలా ఉంటాయో ఇందులో కంటెస్టెంట్స్ కూడా మంచి హాట్ , స్వీట్ అండ్ క్యూట్ పెర్ఫార్మెన్సెస్ తో అదరగొట్టారు. ఇక కార్తీకదీపం సీరియల్ సహృద "చూసా చూసా చూసా" సాంగ్ కి అద్భుతంగా డాన్స్ చేసింది. దానికి శేఖర్ మాస్టర్ ఫుల్ ఫిదా ఐపోయి ఎప్పటిలాగే సహృద డాన్స్ చించేసింది అని కాంప్లిమెంట్ ఇచ్చేసారు. ఇక ఈ షోలోకి హైపర్ ఆది డాక్టర్ గెటప్ లో వచ్చి ఎంటర్టైన్ చేసాడు.
ఇంతలో వర్షిణి స్టేజి మీదకు వచ్చి కంట్లో నలకపడింది అనేసరికి వెళ్లి తీద్దామనుకుంటాడు ఆది. దానికి నందు అడ్డుపడ్డాడు. "కంట్లో నలక పడితే ఉఫ్ ఉఫ్ అని ఊదుతారు లేదంటే నాలుక పెట్టి తీసేస్తారు" అనేసరికి సునంద కూడా "అబ్బా నా కంట్లో కూడా నలక పడింది" అని కొంచెం హడావిడి చేసింది. "నా నాలుకైనా కోసుకుంటా కానీ నీ జోలికి రాను" అని చెప్పాడు ఆది. కానీ ఆది "నా హార్ట్ లో బొక్క పడింది" అని మళ్ళీ గారంగా చెప్పింది సునంద. "నీ వల్ల ఎపిసోడ్ కే బొక్క పడింది హార్ట్ లో పడితే ఏముంది" అని కౌంటర్ వేసాడు ఆది. ఇంతలో సహృద వచ్చి "మీరసలు డాక్టరేనా..ఎందుకు అమ్మను ఎందుకిలా చేసావ్" అని చాలా బాధతో ఆదిని అడిగింది సహృద. "దీనికి చెప్పండ్రా ఎవరైనా నేను ఆ డాక్టర్ బాబును కాదని" అన్నాడు ఆది చాలా బాధతో. ఆ మాటలకు సహృద నవ్వేసింది. ఇక వర్షిణి డాన్స్ చూసిన ప్రణీత తానొక సినిమా కొరియోగ్రాఫర్ లా అనిపించింది అంటూ కామెంట్ చేసింది. ఇక ఫైనల్ గా సాత్విక్ వర్షంలో డాన్స్ చేస్తూ సడన్ గా కాలు జారడంతో కింద పడిపోయాడు. ఇంతకు ఏమయ్యిందో ఎవరికీ తెలీదు. ఐతే ఎపిసోడ్ చూస్తే గాని తెలుస్తుంది.