English | Telugu

నాకు నువ్వంటే ఇష్టమని రాస్తే బాగుండు ఎవరైనా...


తనకు ఎవరూ లవ్ లెటర్ రాయడం లేదని తెగ ఫీలైపోతోంది దివి. ఈమె రీసెంట్ గా "లంబసింగి" మూవీలో నటించింది. ఈ మూవీ ప్రొమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూకి వచ్చింది. అక్కడ తన బాధనంతా వెళ్లగక్కింది. "ఎవరైనా లెటర్ రాసిస్తే బాగుండు అనుకుంటా. ఎవడైనా కొంచెం పెన్ను, పేపర్ పెట్టి కష్టపడి ఓ కవితో, నాకు నువ్వంటే ఇష్టమనో రాసిస్తారేమో అని ఎప్పటినుంచో అనుకుంటున్నా..అలా ఎప్పుడూ ఎవరూ రాసివ్వలేదు" అని బాధపడిపోయింది.

"ఇక సినిమా ఆఫర్స్ వస్తాయని అనుకోలేదు..కొంతమంది సన్నగా ఉన్నానని, కొంతమంది లావుగా ఉన్నానని రిజెక్ట్ చేశారు. రవితేజ గారి పక్కన నేను లీడ్ రోల్ చేయాల్సింది కానీ రాత్రికి రాత్రే క్యారెక్టర్ ని మార్చేశారు. నేను ఇంత సిన్సియర్ గా లవ్ చేస్తున్నానంటే అతను ఎంత బాగా చూసుకుని ఉంటాడు నన్ను... హి ఈజ్ ది బెస్ట్..ఎన్నో ఆడిషన్స్ కి వెళ్లాను, ఎన్నో ఆఫీసుల చుట్టూ తిరిగాను.. ఇంటికి వచ్చాక ఫోన్ రాదు. నేను బాలేనా, నాలో ఏమన్నా ఫాల్ట్ ఉందా, నా యాక్టింగ్ బాలేదా ఏదీ చెప్పరు.. ఎవరికీ తెలీకుండా ఎన్ని సార్లు ఏడ్చానో గుర్తొస్తే ఏడుపొస్తుంది.

నేను ఒక ఫోక్ సాంగ్ చేసాను.. కామెంట్స్ అన్నీ నెగటివ్ గానే ఉన్నాయి. నీకు డాన్స్ వచ్చా, ఏంటి ఇలా ఉన్నాయి, నీ డాన్స్ ఇలా ఉంది అంటూ తిట్టినవాళ్ళే ఎక్కువగా ఉన్నారు.. ఒక్క పాజిటివ్ కామెంట్ కూడా లేదు అందులో...మా పేరెంట్స్ కి తెలిస్తే రివర్స్ లో నన్ను తిడతారేమో అని నేను వాళ్లకు ఏమీ చెప్పలేదు" అని దివి ఆ ఇంటర్వ్యూలో ఎన్నో విషయాలు చెప్పి బాధపడింది. గాడ్ ఫాదర్ మూవీలో కనిపించిన దివికి ఆ తర్వాత పెద్దగా మూవీ ఆఫర్స్ రాలేదు. బిగ్ బాస్ తెలుగు 4 లో కంటెస్టెంట్ గా వెళ్లి బాగా పాపులర్ అయ్యింది. ఆ పాపులారిటీతో కొన్ని వీడియో సాంగ్స్‌, వెబ్ సిరీస్‌లో నటించింది. అయితే ఏదీ ఆమెకు బ్రేక్ ఇవ్వలేదు. మరి లంబసింగి మూవీ అన్నా ఆమెకు బ్రేక్ ఇస్తుందా లేదా చూడాలి.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.