English | Telugu

రిషి సర్ లుక్స్ అదుర్స్...అంతం ఉన్న చోటే ఆరంభం!


గుప్పెడంత మనసు సీరియల్ బుల్లితెర మీద ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలుసు. ఐతే ఈ సీరియల్ హిట్ కి మూలం ఐన హ్యాండ్సమ్ హీరో రిషి సర్ మాత్రం కొన్ని రోజులుగా అస్సలు కనిపించడం లేదు...ఆయన సీరియల్ చేయకపోవడం వెనక చాలా కారణాలు కనబడుతున్నాయి. ఆయన ప్లేస్ లో మరో కొత్త హీరో వచ్చినా ఆడియన్స్ మాత్రం అస్సలు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. ఇంకా రిషి సర్ వస్తారంటూ వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. అలాంటి టైం రిషి సర్ క్యూట్ అండ్ హాట్ లుక్స్ తో బ్లాక్ బియర్డ్ తో కనిపించి ఆడియన్స్ మనసులు దోచేశాడు.

ఆ పిక్స్ ని తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసి "అంతం ఉన్న చోటే ఆరంభం ఉంటుంది. సూర్యుడు అస్తమించిన ప్రతీ సారి కొత్త ఉదయాన్ని తెస్తానంటూ ప్రామిస్ చేస్తాడు " అని కాప్షన్ పెట్టేసరికి నెటిజన్స్ అందులో బోలెడు అర్దాలు వెతికేస్తున్నారు. "అంటే మీరు తిరిగి సీరియల్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు...మీరు పాన్ ఇండియా స్టార్ సర్ ..మీకోసం వెయిటింగ్.. మిమ్మల్ని ప్రిన్స్ అని పిలిచినందుకు మహేష్ బాబుకు మీకు దగ్గర పోలికలు ఉన్నాయి. ఆయనలా మంచి మనసు, సాయం చేసే గుణం, కామెడీ టైమింగ్, ఫాన్స్ మీద రెస్పెక్ట్ ఉన్నాయి. త్వరలో మీరు బిగ్ స్క్రీన్ స్టార్ కావాలని కోరుకుంటున్నాం... మీరు పెట్టిన కాప్షన్ బట్టి మీరు ఏదో కొత్త ప్రాజెక్ట్ తో మమ్మల్ని సర్ప్రైజ్ చేయబోతున్నారనే విషయం తెలుస్తోంది. కొత్త ప్రాజెక్ట్ కి ఆల్ ది బెస్ట్ సర్. మీతోటి వాళ్ళే మిమ్మల్ని దూషిస్తూ అవమానిస్తున్నా మీరు నిలకడగా ఉన్నారు. నాకు బాగా నచ్చింది జెంటిల్మెన్ గారు, మీ మంచి మనసు, మీ సహనమే మిమ్మల్ని ఉన్నత శిఖరాలని అధిరోహించేలా చేస్తుంది. ప్రస్తుతం మీరు ఎదుర్కుంటున్న నెగిటివిటీ మొత్తం మీకు ఆశీర్వాదంగా మారుతుంది. నిన్ను తిట్టేవాళ్ళు పొగిడే రోజు ఒకటొస్తుంది.. ధైర్యంగా, స్ట్రాంగ్ గా ఉండాలని మంచి ఆరోగ్యంతో చిరకాలం సంతోషంగా జీవించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా జెంటిల్మన్ ." అంటూ రిషి సర్ ని పొగడ్తల వర్షంలో ముంచేస్తున్నారు. ఐతే రిషి సర్ పెట్టిన కాప్షన్ కి అర్ధం ఏమిటో త్వరలోనే తెలుస్తుంది.

Karthika Deepam2 : కాశీ అకౌంట్ లో అయిదు లక్షలు.. స్వప్న చూసి షాక్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -551 లో..... కాంచన అన్న మాటలకి శ్రీధర్ బాధపడుతాడు. తినడం మానేస్తాడు. కార్తీక్ వచ్చి నాన్న భోజనం చెయ్యమని తినిపిస్తుంటే ముద్ద దిగడం లేదురా అని ఏడుస్తాడు. ఎందుకు అమ్మ ఇవన్నీ ఇప్పుడు.. ఎప్పటిలాగే మాట్లాడుకోవచ్చు కదా అని కార్తీక్ అంటాడు. నేను కావేరి తరుపున వచ్చాను.. తను ఫోన్ చేసి భయపడుతుంటే చూడలేక వచ్చానని చెప్తుంది. దాంతో శ్రీధర్ బాధపడుతూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇక కాంచనని కార్తీక్ తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతాడు.