English | Telugu

Guppedantha Manasu : నీ లైఫ్ నీ ఒక్కదానిదే కాదు.. మనుది కూడా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -1045 లో..  లెటర్ రాసి వెళ్ళిపోదామనుకున్న అనుపమని ఎక్కడికి వెళ్ళకుండా వసుధార, మహేంద్ర ఆపేస్తారు. ఇంటికొచ్చిన అనుపమతో మహేంద్ర మాట్లాడుతుంటాడు. నువ్వు వెళ్లిపోవాలనేది నా ఉద్దేశం కాదు అనుపమా.. నువ్వు హ్యాపీగా ఉండాలి.. ఇక్కడే ఉండాలి.. ప్రతి ఒక్కరికీ జీవితంలో గడ్డు పరిస్థితులు ఉంటాయి. జీవితం ఎవ్వర్నీ వదిలిపెట్టదు. కొన్ని నెలలక్రితం నేను.. నాతో పాటు వసుధార గడ్డుపరుస్థితుల్ని ఎదుర్కొన్నాం.. ఒక్కొక్కరిదీ ఒక్కో టైమ్ అని మహేంద్ర అంటాడు.

తాగుబోతు రమేష్ జీవితంలో ఇంత విషాదం ఉందా...

ఈ వారం శ్రీదేవి డ్రామా కంపెనీ చాలా అలరించింది. ఇందులో శ్రీదేవి డ్రామా కంపెనీ కాస్తా శ్రీదేవి పురంగా మారిపోయింది. ఎందుకంటే కోరికలు తీరని వాళ్లంతా దెయ్యాలై ఇక్కడ తిరుగుతూ ఉన్నాయి. ఆది, నరేష్  వాళ్లంతా ఎంటర్టైన్ చేసి ఆ దెయ్యాలకు విముక్తి కల్పించారు. ఒక్కో సెగ్మెంట్ ఒక్కోలా నవ్వించింది. చివరిగా ఏఐ టెక్నాలజీ ద్వారా చనిపోయిన పండు, ప్రవీణ్, తాగుబోతు రమేష్ వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడించి వాళ్ళని సంతోషపెట్టారు. ఇక ఈ సెగ్మెంట్ లో తాగుబోతు రమేష్ చాలా ఏడ్చేశాడు. "పొద్దున్న లేచి ఎదురుగా కనిపించేది అమ్మ. వాళ్ళు ఎన్ని తిట్టినా, కొట్టినా చివరకి అమ్మ అంటే అమ్మే..మీకు మీ అమ్మగారితో ఉన్న రిలేషన్ గురించి చెప్పండి" అని రష్మీ అడిగింది. "నాకనే కాదు అందరికీ అమ్మలతో చాలా అటాచ్మెంట్  ఉంటుంది.