English | Telugu

Krishna Mukunda Murari : ఇకనుండి మీరానే ముకుంద.. షాకైన ఫ్యామిలీ!

స్టార్ మా టీవీ లో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -435 లో... ఉదయాన్నే రజినీ ఇల్లంతా చూస్తూ.. ఈ ఆస్తి నా కూతురు సొంతం కావాలి. ఈ ఇంట్లో నేను చక్రం తిప్పాలనుకుంటూ ఉంటుంది. తన తల్లి రజినీ దగ్గరకు సంగీత వచ్చి కాఫీ అడుగుతుంది. అప్పుడే కృష్ణ కిందకు దిగడం చూసిన రజినీ.. అదిగో పనిమనిషి వస్తోంది కదా.. నీకు, నాకు కాఫీ ఇస్తుందిలే అంటూ వెటకారంగా మాట్లాడుతుంది. రజినీ మాటలను విన్న‌ కృష్ణ.. వినలేనట్లుగా వెళ్లిపోతుంటుంది. హేయ్.. ఇంటికి వచ్చిన అతిథులకు మర్యాదల చేయడం రాదా.. కాఫీ ఇచ్చే పనిలేదా అంటు కృష్ణను‌ రజినీ తిడుతుంది.

Krishna Mukunda Murari : కృష్ణ ముకంద మురారి సీరియల్ కొత్త క్యారెక్టర్స్ ఎంట్రీ.. కృష్ణకి మరో ఇద్దరు శత్రువులా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -434 లో.. భవాని దగ్గరికి వెళ్ళి జరిగినవన్నీ చెప్తుంది. తను ఆదర్శ్ మంచికోసమే చేసిందని కృష్ణ తప్పేం లేదని భవాని అంటుంది. ఇక అదేసమయంలో వదినా అనే పిలిచిన పిలుపు.. అరుపులా వినిపిస్తుంది. దాంతో భవానీ, కృష్ణ గది నుండి బయటికి వస్తారు . రేవతి, సుమలత, మధు అంత ఆ అరుపులకు బయటికి వస్తారు. అయితే బ్యాగ్ పట్టుకుని ఓ తల్లీకూతుర్లు హాల్లో నిలబడి ఉంటారు. ఆ వచ్చిన వాళ్లను.. కృష్ణ తప్ప అంత తెలిసిన ముఖాలని చూసినట్లే చూస్తుంటారు.