English | Telugu
విషం కలిపిన కాఫీ తాగిన సుమ.... అసలు ఏం జరిగిందంటే!
Updated : Apr 8, 2024
సుమ అడ్డా షో నెక్స్ట్ వీక్ రిలీజ్ అయింది. ఈ షోకి "గీతాంజలి మళ్ళీ వచ్చింది" మూవీ టీమ్ వచ్చింది. ఈ టీమ్ లో కోన వెంకట్, అంజలి, శివ తుర్లపాటి, శ్రీనివాస్ రెడ్డి వచ్చారు. ఎండలు మండిపోతున్నాయి కాబట్టి స్టేజి మీదకు రాగానే టీమ్ మొత్తానికి సోడాలు ఇచ్చింది సుమ. ఇక సుమ ఎలా చనిపోయిందో చెప్పింది. సుమకి దెయ్యం పట్టేసరికి శ్రీనివాస్ రెడ్డి దెయ్యాన్ని వదిలించడానికి వచ్చాడు. అంజలి సుమని శ్రీనివాస్ దగ్గరకు తీసుకువచ్చి దెయ్యాన్ని వదిలించమని అడిగింది.. "మీ అక్కకు ఏవో తీరని కోరికలు ఉండుంటాయి" అని చెప్పాడు.
దానికి సుమ తాను అసలు ఎలా చనిపోయిందో చెప్పాలి అంది. "మా అత్తగారిని వేసేద్దామని చెప్పి కాఫీలో విషం కలిపాను. ఆవిడేం చేసింది షుగర్ సరిపోయిందా చూడు అని నాకు ఇచ్చింది కక్కుర్తితో చూసా..అంతే పోయా" అని తన మరణ రహస్యాన్ని చెప్పింది. ఇప్పుడు తన కోరిక ఏంటంటే కోన వెంకట్ డాన్స్ చూడాలని ఉందని చెప్పింది సుమ. దాంతో కోన వెంకట్ వచ్చి తనకు నచ్చిన స్టెప్పులతో డాన్స్ చేసాడు. తర్వాత సుమ అంజలితో "సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు" మూవీలో "ఏమో నాకన్నీ అలా తెలిసిపోతాయంతే" అని డైలాగ్ చెప్పించింది. ఇక శివ తుర్లపాటి వచ్చి సుమకి ఒక నిజం "నేను చిన్నప్పటి నుంచి మిమ్మల్ని చూస్తున్నా" అని చెప్పేసరికి "ఎందుకు చూస్తున్నారు" అని రివర్స్ లో అడిగింది సుమ. "ఇంకా మీరు సేమ్ గ్లామర్..సేమ్ మెయింటెనెన్స్" అని శివ ఆన్సర్ ఇచ్చేసరికి పక్కనే శ్రీనివాస్ రెడ్డి సోడా గ్యాస్ సోడా అంటూ ఫన్నీ కౌంటర్ వేసాడు. ఈ ఎపిసోడ్ లో మొత్తం ఐదు రౌండ్లు ఉంటాయి అని సుమ అనేసరికి శ్రీనివాస్ రెడ్డి "ఆల్రెడీ మొదటి రౌండ్ కంప్లీట్ చేసేశాం" అంటూ సోడాను కొట్టి మరీ చూపించేసరికి అందరూ నవ్వేశారు. ఇలా ఈ వారం సుమ అడ్డా షో ఎంటర్టైన్ చేయబోతోంది.