English | Telugu
జూనియర్ రవితేజ డైలాగ్ కి ఫిదా ఐపోయిన సదా...
Updated : Apr 8, 2024
నీతోనే డాన్స్ 2 . 0 ఈ వారం షో ఫుల్ జోష్ తో ఎంటర్టైన్ చేసింది. ఇందులో ఆదివారం ఎపిసోడ్ లో విశ్వా-నేహా కలిసి అద్దిరిపోయే పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఐతే ఈ షో మొత్తానికి విశ్వా వాళ్ళ అబ్బాయి ర్యాన్ హైలైట్ గా నిలిచాడు. ర్యాన్ స్టేజి మీదకు వచ్చి "చావంటే భయపడడానికి అల్లాటప్పాగా తిరిగే" అనే డైలాగ్ ని ఫుల్ మాస్ యాక్షన్ తో రవితేజ "విక్రమార్కుడు" మూవీలో ఎలా చెప్పాడో అలా చెప్పేసరికి స్టేజి మీద ఉన్నవాళ్ళంతా ఫిదా ఇపోయారు. ఇక సదా ఆగలేక స్టేజి మీదకు పరిగెత్తుకుంటూ వచ్చి గోల్డెన్ హార్ట్ ని గిఫ్ట్ గా ర్యాన్ కి ఇచ్చేసింది.
ఇక శ్రీముఖి, విశ్వా వాళ్ళ వైఫ్, నేహా అందరూ కలిసి అంత డైలాగ్ ని సింగల్ టెక్ లో చెప్పినందుకు సెల్యూట్ చేశారు. తర్వాత "నీకు ఎవరంటే ఇష్టం" అని శ్రీముఖి ర్యాన్ కి అడిగేసరికి "సదా" అని ఆన్సర్ ఇచ్చాడు. దాంతో "ఎండమాల్- స్టార్ మా ప్రామిస్ చేయండి.. ఈ పిల్లాడు పెద్దయ్యేవరకు మన షో జరుగుతూనే ఉండాలి.. నేనే జడ్జ్ గా ఉండాలి.. నేను వీడితో ఆడాలి" అని చెప్పింది సదా. తర్వాత ర్యాన్ సదాకి ముద్దు పెట్టేసాడు. ఇక రాధ కూడా "హీరో గారు వచ్చి చాకోలెట్స్ తీసుకోండి" అంటూ ర్యాన్ కి రెండు చాకోలెట్స్ ఇచ్చింది. ఇక తరుణ్ మాష్టర్ ఐతే చాక్లెట్ ఇచ్చి పేపర్ చింపి దిష్టి తీసి ర్యాన్ ని విష్ చేశారు. ఇక ర్యాన్ చెప్పిన డైలాగ్ కి స్టేజి మొత్తం లేచి నిలబడి క్లాప్స్ కొట్టారు. నాగ పంచమి సీరియల్ హీరో పృద్వి వచ్చి ర్యాన్ కి ముద్దులు పెట్టేసుకున్నారు. అలా ఈ వారం షోలో ర్యాన్ సెంటరాఫ్ అట్రాక్షన్ గా నిలిచాడు.