Read more!

English | Telugu

నూకరాజును కుక్క అన్న ఇంద్రజ...రాంప్రసాద్, భావన డాన్స్ రచ్చ


ఉగాది వెళ్లిందంటే శ్రీరామ నవమి వచ్చేస్తుంది. ఇక బుల్లితెర మీద ఆల్రెడీ శ్రీరామ నవమి సందర్భంగా ఈవెంట్ ప్రోమోస్ రిలీజ్ అవుతున్నాయి. శ్రీదేవి డ్రామా కంపెనీ శ్రీరామనవమి ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇక ఇందులో అంతా రామమయం ఐపోయింది. ప్రోమో స్టార్టింగ్ లో ఇంద్రజ చేతిలో ఉన్న కొబ్బరి చిప్పను కమెడియన్ బాబుకి ఇచ్చి పట్టుకోమని చెప్పి చీర సరి చేసుకుంటూ ఉంటుంది. ఇక బాబు ఆగలేక తినేసాడు. "బాబు అది ప్రసాదం కాదు ఏ కుక్కకు, కోతికో ఇవ్వమన్నారు" అని చెప్పింది ఇంద్రజ.

ఇంతలో ఇమ్మానుయేల్ వచ్చి "మీరేం కంగారు పడకుండా ఆల్రెడీ కోతి దగ్గరకే వెళ్ళింది అది" అంటూ బాబుని కోతిగా  సంభోదించేసరికి "ఐతే కాస్త కుక్కకు కూడా ఇవ్వండి" అని కౌంటర్ వేసింది ఇంద్రజ. చివరిలో నూకరాజు ఒక అమ్మాయిని తీసుకొచ్చాడు ఇంద్రజ దగ్గరకు. "ప్రతీ ఎపిసోడ్ కి ఒక్కో అమ్మాయిని తీసుకొచ్చి ఈవిడే నీ అత్తమ్మ" అని నాకు చూపిస్తున్నావు. తర్వాత ఇమ్మానుయేల్ ఒక అమ్మాయిని తీసుకొచ్చి "అన్నయ్య ఐనా రోజుకో అమ్మాయిని తీసుకొస్తున్నాడు..నేను ఒకే అమ్మాయిని తెస్తున్నా" అని చెప్పి కౌంటర్ ఇచ్చాడు. ఇక ఇంద్రజకు కోపం వచ్చి ఇమ్మానుయేల్ ని సరదాగా  కొట్టింది. తర్వాత ఆటో రామ్ ప్రసాద్, భావన వచ్చి "శుభసంకల్పం" మూవీలో "సీతమ్మ అందాలు" సాంగ్ కి డాన్స్ చేశారు. అలాగే ఇందులో ఒక గేమ్ సెగ్మెంట్ కూడా ఇచ్చారు. "రాముడు - సీత" అని చీటీల్లో రాసి ఒక బౌల్ లో వేసి అందరినీ తీసుకోమన్నారు.  రాముడు ఎవరికి వస్తే వాళ్ళు సీతను కనిపెట్టాలి అనే టాస్క్ ఇచ్చింది రష్మీ. చిన్నప్పుడు ఈ ఆటను అందరం ఆడుకునే ఉంటాం. ఇక శ్రీదేవి డ్రామా కంపెనీలో ఈ గేమ్ చూసేసరికి ఆడియన్స్ కి మంచిగా కనెక్ట్ ఐపోయింది.