Read more!

English | Telugu

అభిమానికి రవిశంకర్ ఇచ్చిన ట్రీట్ మెంట్.. సోషల్ మీడియాలో వైరల్!


స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు' కి ఎంత ఫ్యాన్ బేస్ ఉందో సపరేట్ గా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే  ఈ సీరియల్ టైమ్ స్లాట్ ని ప్రైమ్ టైమ్ నుండి తీసేసి‌ మద్యాహ్నం టైమ్ స్లాట్ కి చేంజ్ చేశారు. అయిన టీఆర్పీలో అగ్రస్థానంలో ఉన్న సీరియల్స్ తో పోటీపడుతుంది. అయితే రిషి సీరియల్ నుంచి తప్పుకున్న తరువాత అనుపమ కొడుకిగా మను ఎంట్రీ ఇచ్చాడు.

ప్రస్తుతం ఈ సీరియల్ మను, అనుపమ, ఏంజిల్ ల చుట్టూనే తిరుగుతుంది. అయితే మను పాత్రలో రవిశంకర్ రాథోడ్ తన నటనతో ఫ్యాన్ బేస్ తెచ్చుకుంటున్నాడు. తల్లి ప్రేమకోసం ఎదురుచూసే కొడుకు పాత్రలో ఎమోషన్స్ పండిస్తూ ప్రేక్షకులకి దగ్గరవుతున్నాడు. గృహలక్ష్మి సీరియల్‌లో తులసి కొడుకుగా నటించిన రవిశంకర్ రాథోడ్. తాజాగా ‘హనుమాన్’ సినిమాలోనూ వరలక్ష్మి శరత్ కుమార్‌కి భర్తగా నటించాడు. అటు సినిమాలు, ఇటు సీరియల్స్‌ని బ్యాలెన్స్ చేస్తున్న రవిశంకర్ రాథోడ్ యాక్టరే కాదు డాక్టర్ కూడా.. ఇతను హైదరాబాద్‌లో డెంటల్ సర్జన్‌గా పనిచేస్తున్నారు. షూటింగ్‌కి వెళ్లి అక్కడ కట్ చెప్పగానే.. క్లినిక్‌లో డాక్టర్ డ్యూటీ ఎక్కేస్తుంటాడు రవి శంకర్. అలా అటు యాక్టర్ గానూ.. ఇటు డాక్టర్ గానూ.. మంచి పేరు సంపాదిస్తున్నాడు. 

అయితే తాజాగా రవిశంకర్ రాథోడ్‌ పనిచేస్తున్న క్లినిక్‌కి వెళ్లిన ఓ అభిమాని అతనికి సర్ ప్రైజ్ ఇచ్చారు. దంత సమస్యతో బాధపడుతున్న ఓ అభిమాని.. రవిశంకర్ క్లినిక్‌కి వెళ్లారు. రవిశంకర్ డ్యూటీలో ఉండటంతో ఆ రోగికి ట్రీట్ మెంట్ చేశారు. అనంతరం ఆ రోగి.. నేను మీ ఫ్యాన్‌ని అంటూ తనతో పాటు తెచ్చిన ఫొటో ఫ్రేమ్‌ని రవి శంకర్‌‌కి గిఫ్ట్‌గా ఇచ్చాడు. అయితే ఇదంతా అప్పటికప్పుడు జరిగింది కాకపోవచ్చు కానీ తన ఫ్యాన్స్ నుంచి సర్ ప్రైజ్ గిఫ్ట్ పొందిన రవిశంకర్ రాథోడ్.. ఈ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. కాగా ఇది నెట్టింట వైరల్ గా మారింది. మరి మీలో ఎంతమంది ఈ సీరియల్ ని చూస్తున్నారు. మను యాక్టింగ్ కి అభిమానులెంతమంది కామెంట్ చేయండి.