English | Telugu

దీపని కలిసిన కార్తీక్.. పెళ్లి చేసుకుంటాడా..?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2' (Karthika Deepam 2). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -102 లో.... ఎంత రిక్వెస్ట్ చేసినా దీప వచ్చేలా లేదనుకొని తను హాస్పిటల్ లో ఇచ్చిన ఫోన్ , గాజులు తనకి ఇచ్చేద్దామని కార్తీక్ అవి పట్టుకొని దీప ఉంటున్న ఇంటికి వెళ్తాడు. కార్తీక్ వెళ్లేసరికి దీప ఇంటికి తాళం వేసి ఉంటుంది. కార్తీక్ పక్కింటి వారిని‌‌.. వీళ్ళు ఎక్కడికి వెళ్లారంటూ అడుగుతాడు. ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయారు.. మళ్ళీరామని చెప్పారని వాళ్ళు చెప్పగానే.. కార్తీక్ డిజప్పాయింట్ అవుతాడు. నేను అనుకున్నదే చేసావ్ కదా దీప అని కార్తిక్ అనుకుంటాడు.

మరొకవైపు ఇప్పుడు మళ్ళీ ఆ దీప కార్తీక్ దగ్గరికి వెళ్ళిపోయింది. దీన్నిబట్టి ఆ బిడ్డ తండ్రి అతనే ఉన్నట్లున్నాడని శోభ అనగానే.. ఆ మాట అన్నందుకే నరసింహా చెంపపగిలింది.. నీకు కూడా అలా కావాలా అని అనసూయ అంటుంది. అప్పుడే నరసింహా వస్తాడు. ఇప్పుడు ఏం తొందరపడకు. ఇక వెళ్తే పాపని తీసుకునే రావాలి. నేను ఆలోచిస్తా.. ఆ ఇంట్లో మనకి హెల్ప్ చేసేవాళ్ళు ఉంటే బాగుండని అనసూయ అంటుంది. ఆ తర్వాత మనం అనుకున్నది జరగాలంటే ఆ దీప ఇక్కడ ఉండాలి.. నిన్ను ఆ దీప ఇంట్లో దిగపెడతాను.. నువ్వు ఏం చేస్తావో తెలియదు.. దీపని తీసుకొనే రావాలని పారిజాతానికి జ్యోత్స్న చెప్తుంది. ఆ తర్వాత పూజ చేస్తున్న సుమిత్ర దగ్గరికి.. శౌర్య వచ్చి కళ్ళు మూస్తుంది. సుమిత్ర గుర్తుపట్టి.. శౌర్య వచ్చేసావా? అమ్మ ఎక్కడ అంటూ సంతోషంగా దీప దగ్గరికి వెళ్తారు. దీపని చూసిన పారిజాతం.. మనం వెళ్లి తీసుకొని వద్దామంటే తానే వచ్చిందని అంటుంది.

ఆ తర్వాత దీప దగ్గరికి సుమిత్ర వెళ్లి.. నువ్వు ఇక ఎక్కడికి వెళ్లొద్దని చెప్తుంది. అప్పుడే కార్తీక్ వస్తాడు. అక్కడ దీప, శౌర్యలని చూసి హ్యాపీగా ఫీల్ అవుతాడు. చూసావా బావకి ఏం తెలియనట్లు.. ఇప్పుడే వాళ్ళని చూస్తున్నట్లు ఏం యాక్టింగ్ చేస్తున్నాడోనని పారిజాతంతో జ్యోత్స్న అంటుంది. శౌర్య, సుమిత్ర లోపలికి వెళ్ళాక.. మీకోసం ఇంటికి వెళ్ళానని కార్తీక్ అంటాడు. ఎందుకని దీప అనగా.. ఫోన్, గాజులు తీసుకొని వచ్చి ఇవి ఇవ్వడానికి అని కార్తిక్ చెప్తాడు. మీరు డబ్బులు ఇవ్వాలంటే ఆ డబ్బాలో వెయ్యండి అని కార్తీక్ అంటాడు. ఆ తర్వాత మీ ఎంగేజ్ మెంట్ అంట అని దీప అనగానే.. అది జరగదు.. నాకు జ్యోత్స్న ఇష్టం లేదని అత్తయ్య వాళ్ళతో చెప్పడానికి ఇక్కడికి వచ్చానని కార్తీక్ అనగానే.. కారణం లేకుండా ఇలా నచ్చలేదంటే ఎలా.. మీరు హాస్పిటల్ లో అన్నది ఎవరి ద్వారా అయినా తెలిస్తే అందరు అదే నిజం కాబట్టి ఈ పెళ్లి వద్దని అంటున్నాడనుకుంటారు. మీరు అలా చెయ్యకండి అని కార్తీక్ తో దీప చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.