English | Telugu
బెడ్ పై దీప్తీ సునైనా.. అందాల విందుకు నెటిజన్లు ఫిధా!
Updated : Jul 22, 2024
ఇదేందయ్యా ఇది.. రోజు రోజుకి చిన్న సెలబ్రిటీల అందాల ఆరబోత శృతి మించుతోంది. సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ లిస్ట్ లో ఉన్న కొంతమంది బోల్డ్ ఫోటో షూట్ లతో నెటిజన్లకి షాకిస్తున్నారు.
అషురెడ్డి, ఇనయా సుల్తానా, అనసూయ, అరియానా లాంటి వాళ్ళు రెగ్యులర్ గా హాట్ అండ్ బోల్డ్ ఫోటో షూట్ లు తమ ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ ఫాలోవర్స్ ని సంపాదించుకుంటున్నారు. ఇక నిన్న మొన్నటి దాకా డిసిప్లిన్ గా ఉన్న దీప్తి సునైనా కూడా ఇప్పుడు బోల్డ్ ఫోటోలతో సోషల్ మీడియాలోని కుర్రాళ్ళకి సెగ పుట్టిస్తోంది. ఓ వైపు షార్ట్ ఫిల్మ్స్‌తో పాటు, వీడియో సాంగ్స్‌తో కొన్నాళ్లు సోషల్ మీడియాను ఓ ఊపు ఊపిన ముద్దుగుమ్మ. బిగ్ బాస్ కి వెళ్ళి మరింతగా ఫ్యాన్ బేస్ ని సంపాదించుకుంది.
దీప్తి సునైనాకి ఇన్ స్టాగ్రామ్ లో ' టు క్రియేట్ ఆర్ట్ క్రియేట్ యువర్ సెల్ఫ్ ' అనే క్యాప్షన్ తో పది ఫోటోలతో కూడిన ఫోటోషూట్ ని షేర్ చేసింది. ఇక ఈ ఫోటోలలో తను వైట్ డ్రెస్ వేసుకొని బెడ్ పై వాలిపోయింది. ఈ ఫోటోలలో కొన్ని ఫోటోలు మాములుగా ఉన్నా.. రెండు, మూడు, ఏడు ఫోటోలు మరీ బోల్డ్ గా ఉన్నాయి. దీంతో నెటిజన్ల పాజిటివ్ కామెంట్లతో పాటు నెగెటివ్ కామెంట్లు చేస్తున్నారు. దీప్తీకి ఇన్ స్టాగ్రామ్ లో 4.2 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. అందుకేనేమో తను ఏ ఫోటో షేర్ చేసిన లక్షల్లో వ్యూస్ వస్తుంటాయి. ప్రస్తుతం దీప్తి షేర్ చేసిన ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.