English | Telugu

Vindhya Vishaka : పేపర్ చీరలో యాంకర్ వింధ్య.. ట్రోల్స్ మాములుగా లేవుగా!


కొందరికి పొద్దున్నే పేపర్ చదివే అలవాటు ఉంటుంది. మరికొందరు పేపర్ తో క్రాఫ్ట్స్ అండ్ ఆర్ట్ చేస్తుంటారు. కొందరు సాయంకాలం స్నాక్స్ కోసం మిర్చి బజ్జీల బండి వారు వాడుతుంటారు. అయితే వాటితో పాటు ఇంట్లో వాడుకుంటారు. అయితే ఓ సెలెబ్రిటీ దాంతో చీర చేపించుకొని ఓ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చేసింది. తనే యాంకర్ వింధ్య విశాఖ.

అప్పట్లో స్పోర్ట్స్ ప్రజెంటర్‌గా ఫుల్ బిజీగా ఉండేది యాంకర్ వింధ్య విశాఖ. ఐపీఎల్ సహా అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లకి తెలుగు ప్రెజెంటర్‌గా ఈమె చేసింది‌. అయితే ఇటీవల నెమ్మదిగా మూవీ ఈవెంట్స్‌కి షిఫ్ట్ అయింది. ఈమె గలగల మాట్లాడుతూ ఆడియన్స్‌ను బాగానే ఆకట్టుకుంటుంది. పెద్ద సినిమాల ఈవెంట్స్ అన్నీ యాంకర్ సుమ హోస్ట్ చేయడం ఎన్నో ఏళ్లుగా సాగుతోంది. ఇక చిన్న సినిమాల ఈవెంట్స్ సంగతి ఇతర యాంకర్స్ చూసుకుంటున్నారు. తాజాగా డబ్బింగ్ చిత్రాల ఈవెంట్స్‌ను జోరుగా చేస్తుంది యాంకర్ వింధ్య విశాఖ.

భారతీయుడు-2 ప్రెస్ మీట్ కి యాంకర్ గా చేసిన వింధ్య విశాఖ, తాజాగా రాయన్ ప్రీ రిలీజ్‌ ఈవెంట్ కి యాంకర్ గా చేసింది. ఇందులో తను పేపర్ తో కూడిన చీరతో వచ్చేసింది. అది చూసిన సోషల్ మీడియాలోని కొంతమంది ట్రోల్స్, మీమ్స్ చేస్తున్నారు. అయితే ఆ మీమ్స్ ని ట్రోల్స్ ని తను సరదాగా తీసుకొని ఇన్ స్టాగ్రామ్ లో స్టాటస్ గా పెట్టేస్తుంది. వింధ్య విశాఖ మొన్నటి ఐపీఎల్ కి సన్ రైజర్స్ హైదరాబాద్ కి సపోర్ట్ చేయండి అంటు చేసిన ఓ వీడియో వైరల్ అయింది. ఇక నిన్నటి న్యూస్ పేపర్ చీరతో మరింత క్రేజ్ తెచ్చుకుంది ఈ భామ. వింధ్య విశాఖకి ఇన్ స్టాగ్రామ్ లో 240K ఫాలోవర్స్ ఉన్నారు. నెట్టింట వైరల్ గా మారిన తన చీరని ఓ సారి చూసేయ్యండి.