English | Telugu
ఆయ్ మూవీ హీరోయిన్ పై థమన్ కామెంట్స్
Updated : Jul 22, 2024
ఇండియన్ ఐడల్ సీజన్ 3 ఈవారం ఫుల్ ఎంటర్టైన్ చేసింది. ఈ షోకి "ఆయ్" మూవీ టీం నుంచి నార్నె నితిన్, సింగర్ రామ్ మిరియాల వచ్చారు. ఇక రామ్ తో కలిసి స్కంద అనే కంటెస్టెంట్ ఒక సాంగ్ కూడా పాడాడు. ఐతే శ్రీ ధృతి "నిన్ను కోరి" అనే సాంగ్ పాడింది. దానికి అందరూ కొన్ని కరెక్షన్స్ కొన్ని విషయాల్లో ఎలా పాడాలో చెప్పారు. "ఈ పిల్ల ఇంత టెన్షన్ పడుతోంది..ఎలా పడుతుందా" అని అనుకున్నా అన్నాడు రామ్ మిరియాల. కానీ బాగా పాడింది అన్నాడు.
ఐతే మధ్యలో థమన్ అడిగిన ప్రశ్నకు అందరూ షాక్ అయ్యారు. "మీ సినిమాలో హీరోయిన్ లేదా బ్రో" అని అడిగేసరికి "హీరోయిన్ బిజీగా ఉంది ఈరోజు రాలేకపోయింది." అని రామ్ మిరియాల ఆన్సర్ ఇచ్చాడు. దానికి "మీరు కూడా నెక్స్ట్ వీక్ రావాల్సింది" అన్నాడు థమన్. "అంటే మనమే వచ్చాము హీరోయిన్ రాలేదని థమన్ అన్నా ఫీలవుతున్నాడు..." అని రామ్ అనేసరికి థమన్ నవ్వేసాడు. " అన్నా పంపిస్తానని మా డైరెక్టర్ గారిని అడిగి" అనేసరికి "హే ఛీఛీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు " అన్నాడు థమన్. ఇంతలో గీతామాధురి థమన్ తో ఏదో మాట్లాడింది. దాంతో వెంటనే థమన్ "అలా కాదు బ్రో జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం " అన్నాడు. ఎనర్జిటిక్ హీరో నార్నే నితిన్, నయన్ సారిక జంటగాఈ మూవీలో నటించారు. యంగ్ ప్రొడ్యూసర్స్ గా బన్నీ, విద్యా కొప్పినీడి ఉన్నారు.