English | Telugu
ఓరినీ పాసుగాల రాకేషా.. ఇదట్రా నువ్వు చెప్పేది...
Updated : Jul 21, 2024
సోషల్ మీడియాలో కొన్ని రీల్స్ ముందు బీభత్సమైన సీరియస్ నెస్ తో ఏదో జరిగిపోయింది, జరిగిపోయినట్టుగా బిల్డప్ ఇచ్చేసి మరీ చెప్తారు కొంతమంది. అందులో చూస్తే ఎం ఉండదు. జస్ట్ కామెడీని సీరియస్ ఎక్స్ప్రెషన్స్ తో కొంపలు మునిగిపోయినట్టు చెప్తారు. ఇంకొంతమంది మాత్రం బీభత్సమైన సీరియస్ విషయాన్ని కాస్తా పిచ్చ లైట్ గా చెప్పి నవ్వేస్తారు. ఇంకొంతమంది పైనుంచి ఆకాశం పడిపోతున్నా..కింద నుంచి నేల జారిపోతున్నా కూడా ఆ నాకేముందిలే అని వదిలేస్తారు. రాకింగ్ రాకేష్ (Rocking Rakesh) మొదటి కోవకు చెందిన వాడు.
రాకేష్ రీసెంట్ గా ఒక రీల్ ని రిలీజ్ చేసాడు. ఎన్నో రోజుల నుంచి ఒక విషయం చెప్పాలనుకుంటున్న..కానీ ఎందుకులే అనుకుంటున్నా..కాంట్రవర్సీ ఐనా పర్లేదు, ఎవరేమనుకున్నా పర్లేదు...దీన్ని న్యూస్ చేసి న్యూసెన్స్ చేసినా పర్లేదు. ఎన్ని రోజులను ఊరుకుంటామండీ. ఐనా ఈరోజు చెప్పేద్దాం అనుకుంటున్నా. అంటున్నారని..పడుతున్నారని అనుకుంటున్నారు...వింటున్న వాళ్లంతా రిటర్న్ చెప్పలేరని కాదు. ఎవరేమనుకున్నా ఖరాకండిగా చెప్పాలనుకున్నది చెప్పేస్తాను. చెప్పాలనుకున్న విషయం ఒకటే ఒకటుంది వెదర్ చాలా బాగుంది. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అని మొదటంతా సీరియస్ గా చెప్పి లాస్ట్ లో ట్విస్ట్ ఇచ్చాడు.
ఆ ఒక్క మాటతో నెటిజన్స్ అంతా తెగ కామెంట్స్ చేస్తున్నారు. "సూపర్ అన్న నువ్వు ఈ రోజు నిజంగా కామెడీ చేసావు రాకేష్ అన్న.. పోనీలే బ్రదర్ ఇప్పటికైనా చెప్పారు...మీ ధైర్యానికి,సాహసానికి శుభోదయం.నిజంగానే వాతావరణం చాలా బావుంది..." అంటున్నారు.