English | Telugu
ఎటో వెళ్ళిపోయింది మనసు సీరియల్ లో కీలక ఎపిసోడ్.. అది నిజమేనా!
Updated : Jul 22, 2024
ప్రతీరోజు ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లతో ఆకట్టుకుంటున్న సీరియల్ ' ఎటో వెళ్ళిపోయింది మనసు'. స్టార్ మా టీవీలోని సీరియల్స్ అన్ని ప్రోమోలతో పోలిస్తే ఈ సీరియల్ ప్రోమో ప్రస్తుతం యూట్యూబ్ ట్రెండింగ్ లో టాప్-50 లో కొనసాగుతుంది.
మరి అంతగా ఈ సీరియల్ లో ఏం ఉందంటే... గత జన్మలో సీతని చాటుగా చూసి రామ ప్రేమిస్తాడు. ఆ విషయం సీతకి తెలిసి తనకి కూడా ఇష్టమేనని చెప్తుంది. ఇంట్లో చెప్పకుండా సీత లేచిపోయి వస్తుంది. స్నేహితుడి సహాయంతో సీతని రామ పెళ్లిచేసుకుంటాడు. ఆ తర్వాత పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉంటామనే టైమ్ లో పెళ్లి ఇష్టం లేని సీత వాళ్ళ అన్నయ్య పరువు మర్యాదలే ముఖ్యమని భావించి రామని చంపేస్తాడు. ఆ దిగులుతో సీత కూడా చనిపోతుంది. ఈ జన్మలో మనల్ని విడదీసినా మన ప్రేమ వచ్చే జన్మలో కూడా ఉంటుందని గత జన్మకీ సంబంధించిన పాత్రలను ముగించారు డైరెక్టర్. గత జన్మలో రామగా చనిపోయి ఈ జన్మలో సీతాకాంత్ గా, సీతేమో రామలక్ష్మిగా పుడతారు. సీతాకాంత్ పుట్టిన ఇరవై సంవత్సరాలకి రామలక్ష్మి జన్మిస్తుంది. రామలక్ష్మి సివిల్ సర్వీస్ కోచింగ్ తీసుకుంటుంది. ఇక రామలక్ష్మిని సీతాకాంత్ పెళ్ళి చేసుకుంటాడు. సీతాకాంత్ వాళ్ళ సవతి తల్లి శ్రీలత గురించి, తన నిజస్వరూపాన్ని తెలుసుకున్న రామలక్ష్మి ఆమె ఎత్తులని చిత్తు చేస్తుంటుంది.
తాజాగా యూట్యూబ్ లో రిలీజైన ఎటో వెళ్ళిపోయింది మనసు ప్రోమోకి అత్యధిక వీక్షకాధరణ లభించింది. సీతాకాంత్ తన భార్య రామలక్ష్మి మీద ప్రేమని తెలియజేశాడు. మోకాళ్ళ మీద కూర్చొని ఓ డైమండ్ రింగ్ చేతిలో పట్టుకొని రామలక్ష్మికి లవ్ ప్రపోజ్ చేశాడు. అది చూసిన రామలక్ష్మి ఫిధా అయింది. మరి ఇది నిజమేనా.. లేక రామలక్ష్మి గానీ సీతకాంత్ గానీ కల కంటున్నారా అనేది తెలియాలంటే ఈ సీరియల్ నేటి ఎపిసోడ్ చూడాల్సిందే. వీళ్ళిద్దరూ కలవడం కోసం ఎంతో మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి నేటి కథనంలో వీరిద్దరు కలుస్తారా లేదా అనేది ఉత్కంఠభరితంగా మారింది.