English | Telugu

Eto Vellipoyindhi Manasu : భార్యకి ప్రపోజ్ చేసిన భర్త.‌. డిస్సప్పాయింట్ అయిందింగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్ళిపోయింది మనసు'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -156 లో.. సీతాకాంత్ ఆఫీస్ స్టాఫ్ తో కలిసి లంచ్ చేస్తుంటాడు. అక్కడ పక్కనే కూర్చొని ఉన్నా రామలక్ష్మిని ప్రేమగా చూస్తాంటాడు. అది చూసి నమిత తననే చూస్తున్నాడని అనుకొని సిగ్గుపడుతుంది. ఆ తర్వాత సీతాకాంత్ ఫోన్ మాట్లాడుతు.. వెళ్ళిపోతే నమిత కూడా వెనకాలే వెళ్తుంది. సీతాకాంత్ పక్క నుండి పట్టించుకోకుండా వెళ్లిపోతుంటే‌‌.. ఏంటి సర్ అక్కడ అలా చూసి ఇక్కడికి వచ్చాకా ఇలా చేస్తున్నారని నమిత అడుగుతుంది. నిన్ను చూడడమేంటి నా భార్య రామలక్ష్మిని చూసాను.. నా మనసంతా తనపై ప్రేమ ఉందని సీతాకాంత్ అంటాడు.

ఆ తర్వాత జ్యువలరీ ఆడ్ గురించి నమితని అడుగుతాడు. నేను రెడీ చేస్తానని సీతాకాంత్ అనగానే మీరు మల్టీ టాలెంటెడ్ సర్ అన్నీ ఒకేసారి ఎలా చూసుకుంటారని పొగుడుతుంది. దాంతో సీతాకాంత్ కోప్పడతాడు. నమిత భయపడడంతో.. జోక్ చేశానని సీతాకాంత్ అంటాడు. కొంచెం డిఫ్ఫికల్ట్ కానీ ట్రై చేస్తే వర్క్ అవుట్ అవుతుందని నమిత అనుకుంటుంది. ఆ తర్వాత ఆఫీస్ టైమ్ అయిపొయింది ఇంకా సర్ బయలుదేరడం లేదేంటని రామలక్ష్మి.. సీతాకాంత్ దగ్గరికి వస్తుంది. ఏంటి సర్ ఏదో ఆలోచిస్తున్నారని అడుగుతుంది. ఒక అమ్మాయిని అబ్బాయి ప్రేమిస్తున్నాడు. ఆ విషయం ఎలా చెప్పాలని అడిగాడు అని సీతాకాంత్ అనగానే.. మీరే ఇండైరెక్ట్ గా అడుగుతున్నారా అని రామలక్ష్మి అనుకుంటుంది. మీరు ఎవరికి చెప్పాలి అనుకుంటున్నారని రామలక్ష్మి అడుగతుంది. ఆడ్ ఏజెన్సీ వాళ్లకి అని సీతాకాంత్ అంటాడు. నువ్వు ఒక ఐడియా చెప్పమని రామలక్ష్మిని సీతాకాంత్ అడుగగా‌‌.. ఏముంది లవ్ లో ప్యూరిటీ ఉంటే చాలని రామలక్ష్మి అంటుంది.

ఆ తర్వాత సందీప్ ఇంటికి రాగానే ఆఫీస్ లో శ్రీవల్లి, శ్రీలతలు జరిగింది అడిగి తెలుసుకుంటారు. ఆ రామలక్ష్మికి టార్చర్ చూపించానని సందీప్ అంటాడు‌. అప్పుడే రామలక్ష్మి వస్తుంది. ఈ రోజు ఆఫీస్ లో బాగా కోటింగ్ అయిందట కదా అంటూ రామలక్ష్మి బాధపడేలా శ్రీలత మాట్లాడుతుంది. అప్పుడే సీతకాంత్ వస్తాడు.. ఆ తర్వాత రామలక్ష్మి అంటు సీతాకాంత్ ఇల్లంతా తిరిగి కిచెన్ లో ఉన్న రామలక్ష్మిని గదిలోకి తీసుకొని వెళ్లి.. రింగ్ ఇచ్చి ప్రపోజ్ చేస్తాడు. దాంతో రామలక్ష్మి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎలా ఉంది కాన్సెప్ట్.. నువ్వు ఇచ్చిన ఐడియాతో ట్రై చేశాను. ఇది ఆడ్ ఏజెన్సీ వాళ్లకు చెప్పేది అనగానే రామలక్ష్మి డిస్సప్పాయింట్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.