English | Telugu

Guppedantha Manasu : వసుధారని చూసి షాకైన శైలేంద్ర.. అతని ప్లాన్ నెరవేరేనా!

స్టార్ మా టీవీలో ప్రసారవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు '. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -1133 లో.. వసుధార, రంగాలు వెళ్తుంటే టీ తాగాలని ఉందని వసుధార అనడంతో.మ రంగా అటో ఆపుతాడు. టీ ఎలా చెయ్యాలో టీ షాప్ అతనికి బాబాయ్ ఇలా చెయ్యాలంటూ చెప్తాడు. మీరు నా రిషి సర్.. నాకు టీ ఎలా ఇష్టమో నేను ఎలా చేస్తానో మీరు చెప్పారని వసుధార అంటుంది. నేను కాదంటూ రంగా అంటాడు. మరొకవైపు శైలేంద్ర, దేవయానిలు ఒక దగ్గర మాట్లాడుకుంటారు. వాడు రిషి కావచ్చని దేవయాని భయపడుతుంది.

అయ్యే ఛాన్స్ ఉండదు.. వాడు రంగానే ఎందుకంటే వాడి మరదలు చిన్నప్పటి నుండి వాడిని లవ్ చేస్తోందని చెప్పింది కదా అని శైలేంద్ర అంటాడు. అయిన నాకెందుకో వాడే రిషి అనిపిస్తుందని దేవయాని అంటుంది. వాడు రంగా అయితే మనం అనుకున్నది జరుగుతుంది. నువ్వు కొన్ని రోజులు ఇక్కడే ఉండి, వాడు రిషినో రంగానో కనుక్కోమని శైలేంద్రకి‌ దేవయాని చెప్తుంది. అప్పుడే ధనరాజ్ కార్ లో నుండి వచ్చి.. ఏంటి మీరు కారులో నన్ను ఉంచి.. మీరు మాట్లాడుకుంటున్నారని అంటాడు. ఏం లేదు అమ్మాయి నీకు నచ్చిందా అని ధనరాజ్ ని శైలేంద్ర అడుగుతాడు. నచ్చిందని అనగానే కానీ నువ్వు ఆ అమ్మాయికి నచ్చలేదు కదా అందుకే నేను కొన్ని రోజులు ఇక్కడే ఉండి వాళ్ళని ఒప్పిస్తానని శైలేంద్ర అంటాడు. నేను కూడ ఉంటానని ధనరాజ్ అనగానే.. నువ్వు ఉంటే ఈ పెళ్లి సెట్ కాదని శైలేంద్ర అంటాడు. ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోయాక శైలేంద్ర రంగాని వెతికే పనిలో పడతాడు. మరొకవైపు వసుధార, రంగాలు టీ తాగుతుంటారు. ఆ తర్వాత శైలేంద్ర ఒకతన్ని ఆపి రంగా గురించి అడుగుతాడు. రిషి ఫోటో చూపిస్తాడు. అతను మా రంగా.. సూట్ లో బాగున్నాడు మీరే తీసారా.. నాక్కూడా ఇలా సూట్ లో తీస్తారా అని అతను అనగానే శైలేంద్ర కోప్పడతాడు. ముందు వీడు ఎక్కడన్నాడు కనుక్కోమని శైలంద్ర అనగానే.. అతను రంగాకి ఫోన్ చేస్తాడు. టీ షాప్ దగ్గరున్నా అని రంగా చెప్పగానే శైలేంద్ర అక్కడికి బయల్దేరి వెళ్తాడు.

మరొకవైపు రంగా కి ఫోన్ వస్తే.. మళ్ళీ వస్తానంటూ వసుధారని వదిలి పెట్టి వెళ్తాడు. టీ షాప్ దగ్గర వసుధార ఉంటుంది. అక్కడ వసుధారని చూసి శైలేంద్ర షాక్ అవుతాడు. మరొకవైపు రౌడీలు వసుధారని చూస్తారు. దాంతో వసుధార అక్కడ నుండి పరిగెడుతుంది. శైలేంద్ర కళ్ళు నులిమికొని చూసేసరికి వసుధార మాయమవుతుంది. నేను నిజంగానే వసుధారని చూసానా అని శైలేంద్ర అనుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.