English | Telugu

ఆ రింగ్ రంగా చేతికి ఎలా వచ్చింది.. తండ్రి కోసం మను ఆవేదన!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు' (Guppedantha Manasu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -1138 లో.. అనుపమ, మనులు దేవయాని ఇంటికి వస్తారు. వాళ్ళని చూసిన దేవయాని.. దారి తప్పి వచ్చారా అని అంటుంది. లేదు కావాలనే వచ్చామని అనుపమ అనగా.. ఎందుకని దేవాయని అడుగుతుంది. మహేంద్రతో మాట్లాడాలని అనుపమ అనగానే తనని మీరు వదిలేసి వెళ్లారని మీపై కోపంగా ఉన్నాడని దేవయాని అంటుంది. అప్పుడే మహేంద్ర వస్తాడు. ఎలా ఉన్నారు సర్ అని మను అడుగుతాడు. ఎదో ఇలా ఉన్నానని మహేంద్ర అంటాడు. నేను, మను ఈ సిటీ వదిలి వెళ్లిపోతున్నాం.. అందుకు మను కూడా ఒప్పుకున్నాడు.. ఒకసారి నిన్ను కలిసి చెప్పి వెళదామని వచ్చామని అనుపమ అంటుంది. ఇన్నిరోజులు ఒక ప్రశ్నకి సమాధానం కోసం చూసావ్.. ఆ ప్రశ్నకి సమాధానం రాకుండానే వెళ్ళిపోతావా అని మహేంద్ర అనగానే.. ఆ ప్రశ్నకి సమాధానం అవసరం లేదని వెళిపోతున్నానని మను అంటాడు.

ఆ తర్వాత మహేంద్ర దగ్గర మను ఆశీర్వాదం తీసుకుంటాడు. మీరు ఈ సిటీ వదిలి వెళ్లొద్దని మహేంద్ర అంటాడు. ఆ తర్వాత మహేంద్ర వెళ్ళిపోతాడు. మీకు సిగ్గు అభిమానం ఉంటే.. మళ్ళీ మా ఇంట్లో అడుగుపెట్టకండని దేవయాని అనగానే మనుకి కోపం వస్తుంది. కానీ సైలెంట్ గా అక్కడ నుండి వెళ్ళిపోతారు. మరొకవైపు శైలేంద్ర చెప్పిన దానికి ఒప్పుకొని రంగా డబ్బులు కూడా తీసుకుంటాడు. ఇప్పుడే నాతో రావాలని శైలేంద్ర అంటాడు. ఇంట్లో వాళ్ళకి చెప్పి వస్తానని రంగా అంటాడు. అంత టైమ్ లేదని శైలేంద్ర అంటాడు. సరే బుజ్జి లకి డబ్బులు ఇచ్చి వస్తానని రంగా ఎదరుగా ఉన్న బుజ్జి దగ్గరకి వెళ్తాడు. బుజ్జి కి డబ్బులు ఇచ్చి.. నానమ్మని హాస్పిటల్ లో చూపించమని రంగా అంటాడు. పని మీద వెళ్ళాడు వస్తాడని చెప్పమని రంగా అంటాడు. మరి మేడమ్ గారు అడిగితే ఏమని చెప్పాలని బుజ్జి అంటాడు. రంగా తన జేబు లో నుండి VR అనే అక్షరాలు గల రింగ్ ని బుజ్జికి ఇచ్చి ఇది మేడమ్ గారికి ఇవ్వు మేడమ్ నిర్దారించుకుంటుంది. అంతే కాకుండా సర్ తో ఉన్న ఫోటోని మేడమ్ కి చూపించు అర్థం చేసుకుంటుంది.. ఫోన్ లో ఏం చేయాలో చెప్తానని బుజ్జికి రంగా చెప్తాడు. మరొకవైపు శైలంద్ర దేవయానికి ఫోన్ చేసి మన ప్లాన్ సక్సెస్ ఆ రంగా గాడు నాతో వస్తున్నాడని చెప్తాడు. ఆ తర్వాత రంగా, శైలేంద్ర లు ఇద్దరు బయల్దేరతారు.

మరొకవైపు అమ్మ నా తండ్రి మహేంద్ర సారె కదా అని మను అంటాడు. దాంతో అనుపమ షాక్ అవుతుంది. నీకెందుకు అలా అనిపించిందని అనుపమ అనగానే.. సర్ ని కలిసినప్పుడల్లా ఏదో ఎఫ్ఫిక్షన్ అని మను అంటాడు. నా తండ్రి ఎవరో ఇప్పటికైనా చెప్పు.. అసలు నువ్వు నా కన్నా తల్లీవేనా ఇన్నిసార్లు అడుగుతున్నా.. నా వేదన అర్థం అవ్వడం లేదా అని మను అనగానే.. అమ్మ అంటే అర్థం తెలుసకున్న రోజు, నువ్వు ఈ ప్రశ్న అడుగమని అనుపమ చెప్పి బాధపడుతు వెళ్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.