English | Telugu

రామలక్ష్మికి కీలక బాధ్యతలు అప్పగించిన సీతాకాంత్.. శ్రీలత మాస్టర్ ప్లాన్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఎటో వెళ్ళిపోయింది మనసు' (Eto Vellipoindi Manasu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -160 లో... సందీప్ ప్లాన్ ని కనిపెట్టినందుకు రామలక్ష్మి హ్యాపీగా ఫీల్ అవుతూ.. ఎలా ఉంది నా ప్లాన్ అని శ్రీలత వాళ్లతో అంటుంది. దాంతో శ్రీలత కోపంగా గెలిచానని విర్రవీగకు నెక్స్ట్ నేను కొట్టే దెబ్బని తట్టుకోలేవని అంటుంది. అది చూద్దామని రామలక్ష్మి అంటుంది. ఇంకో వారంలో నీ భర్తని చైర్మన్ సీట్ నుండి తొలగించి సందీప్ ని చైర్మన్ ని చేస్తాను చూడు.. కంపెనీనీ ఈ ఆస్తులన్ని నా సొంతం చేసుకుంటానని శ్రీలత అనగానే.. ఎలా చేసుకుంటావో నేను చూస్తానని రామలక్ష్మి అంటుంది. నరకం అంటే ఏంటో ప్రత్యక్షంగా చూపిస్తానని రామలక్ష్మికి శ్రీలత వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది.

ఆ తర్వాత సీతాకాంత్ దగ్గరికి రామలక్ష్మి వచ్చి.. సారీ అండి మీ తమ్ముడు చేసిన తప్పుని బయటపెట్టి మిమ్మల్ని బాధపడేలా చేసానని రామలక్ష్మి అనగానే.. అలా ఏం కాదు నన్ను నా కంపెనీ పరువు కాపాడావ్.. నీకు థాంక్స్ చెప్పాలని సీతాకాంత్ అంటాడు. మీ కింద ఉద్యోగం చేస్తున్నా కదా.. అది నా బాధ్యత అందుకు జీతం ఇస్తున్నారు కదా అని రామలక్ష్మి అనగానే.. ఏం కావాలి చెప్పు ఏదైనా ఇస్తానని సీతాకాంత్ అంటాడు. అవసరం వచ్చినప్పుడు నేను అడుగుతానని రామలక్ష్మి అంటుంది. నువ్వు ఇదంత ఎందుకు చేసావని సీతాకాంత్ అడుగగా.. అందరు బాగుండాలని చేసే మీకు మీరు బాగుండాలని చేశానని రామలక్ష్మి అంటుంది. అప్పుడే పెద్దాయన వచ్చి.. అబ్బా నవ్వుతున్నావా ఇంకా కోపంతో అరుస్తున్నావేమోనని భయపడ్డాను.. రామలక్ష్మికి నువ్వు అంటే ఇష్టంరా మనవడినో, మనవరాలినో ఎప్పుడు ఇస్తున్నావని పెద్దాయన అంటాడు.

ఆ తర్వాత శ్రీవల్లి, సందీప్, శ్రీలతలు మాట్లాడుకుంటారు. మనం అనుకున్నది జరగదని సందీప్ అంటాడు. జరుగుతుందని శ్రీలత సందీప్ ని తీసుకోని ఒక ఇంటికి వస్తుంది. తీరా చూస్తే అక్కడ నమిత ఉంటుంది. సందీప్ షాక్ అవుతాడు. మన పని కోసం నేనే జాబ్ లో పెట్టానని శ్రీలత అనగానే.. అన్నయ్యని తన పైకి డైవర్ట్ చేసుకుంటే.. నేను చైర్మన్ కావచ్చని సందీప్ అంటాడు. నేను చెప్పింది చెయ్ అని శ్రీలత నమితకి చెప్తుంది. ఆ తర్వాత మీటింగ్ లో సందీప్ చేసిన తప్పుని చెప్పి ఆ తప్పు జరగకుండా రామలక్ష్మి కాపాడిందని తనకి థాంక్స్ చెప్తాడు. ఇక నుండి ఆఫీస్ లో రామలక్ష్మిని క్రాస్ చెక్ ఆఫీసర్ గా అప్పాయింట్ చేస్తున్నాను.. ఏది జరిగినా తన వరకు వెళ్ళాలని చెప్పగానే రామలక్ష్మి హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత సీతాకాంత్, రామలక్ష్మి మాట్లాడుకుంటుంటే.. సీతకాంత్ వేలికి ఏదో గుచ్చుకొని రక్తం వస్తుంటుంది. రామలక్ష్మి వెంటనే వేలికి ఏమైందని టెన్షన్ పడుతుంది. అప్పుడే మాణిక్యం వస్తాడు. ఎప్పుడు రావాలో తెలియదని మాణిక్యంపై సీతాకాంత్ చిరాకు పడుతుంటాడు. దాంతో రామలక్ష్మి నవ్వుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.