English | Telugu
టైటానిక్ హీరోయిన్ ని చూసి రతిక రోజ్ అలా మార్చుకుందంట!
Updated : Jul 28, 2024
రతికరోజ్ (Rathika Rose).. బిగ్ బాస్ సీజన్ సెవెన్ తో ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. అటు పల్లవి ప్రశాంత్ తో ఇటు ప్రిన్స్ యావర్ తో లవ్ ట్రాక్ నడిపి బిగ్ బాస్ అభిమానులకి 'బేబీ' సినిమా చూపించేసింది.
బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో మొదటి రెండువారాల్లో రతిక ఆట చూసి ఈసారి టాప్-5 లో గ్యారెంటీగా ఉంటుందనుకున్నారు. హౌస్ లో సీక్రెట్ రూమ్ కి రతికని పిలిచి ఉడతా ఉడతా ఊచ్ పాట ప్లే చేసి ఎన్నిసార్లు ఉడతా అని వచ్చిందో బిగ్ బాస్ చెప్పమన్నప్పుడు .. సరిగ్గా లెక్కవేసి చెప్పినందుకు నాగార్జునతో పాటు ఆడియన్స్ షాక్ అయ్యారు. ఇంత ఇంటెలిజెంట్ గేమ్ ప్లేయర్ బిగ్ బాస్ సెవెన్ లో ఉందా అని అనుకున్నారంతా.. కానీ ఆ తర్వాత ప్రశాంత్ కలిపిన పులిహోర సరిగ్గా రాకపోయేసరికి అభిమానులు తెగ ద్వేషించారు. ఇక ప్రశాంత్ తో గొడవ జరిగిన నాటి నుండి యావర్ కి దగ్గరవ్వడం.. ఒకే ప్లేట్ లో కలిసి తినడం చూసి అంతా మరో బకరా రెడీ అని ట్రోల్స్ చేశారు. అయితే తన నేచర్ ని చూసి ఇంత కన్నింగ్, ఫ్లిప్పింగ్ ఎవరు లేరని అర్థమైపోయింది. సోషల్ మీడియాలోని నెటిజన్లు ఒకకానొక దశలో తను రతిక పాప కాదు డీజే టిల్లు సినిమాలోని రాధిక పాప అని కూడా అన్నారు. అలా తనకి నెగెటివ్ టాక్ వచ్చేసింది.
బిగ్ బాస్ తర్వాత వరుసగా ఆఫర్లు తెచ్చుకుంటున్న ఈ భామ.. ఈ మధ్య వరుసగా ఫోటో షూట్లు చేస్తోంది. ఇక తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ లో ఆస్క్ మీ ఏ క్వశ్చన్ అంటూ అభిమానులను పలకరించింది. ఇందులో తను కొన్ని ఆసక్తికరమైన విషయాలని పంచుకుంది. ఎనీ అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ అని ఒకరు క్వశ్చన్ చేయగా.. తమిళ్ లో కొన్ని సినిమాలు చేసానని, అఫీషియల్ అనౌన్స్ మెంట్ కోసం వెయిటింగ్ అని రిప్లై ఇచ్చింది రతిక. ఇక బిబి బజ్ కి హోస్ట్ గా చేస్తారా అని మరొకరు అడుగగా.. లేదని అంది. బిగ్ బాస్ నుండి ఏం నేర్చుకున్నావని ఒకరు అడుగగా.. గతం గురించి ఆలోచించొద్దు.. ప్రతీరోజు మనకి మనం షైన్ అవ్వాలంటూ రిప్లై ఇచ్చింది. మీ పేర్లతో కన్ ఫ్యూజన్ ఉంది. ఫస్ట్ ప్రియ, తర్వాత రోజ్, ఇప్పుడు రతిక రవీందర్ ఎందుకని ఒకరు అడుగగా.. నా స్క్రీన్ నేమ్ రతిక అని మార్చుకోవాలనుకుంటున్నాను. టైటానిక్ లో నాకు బాగా ఇష్టమైన క్యారెక్టర్ రోజ్. నాకు ఈ పేరుతో ఇంత గుర్తింపు వస్తుందని ఊహించలేదు. కాస్త ప్రొఫెషనల్ గా ఉండాలని ఇలా నా పేరు మార్చుకున్నా.. ఫైనల్లీ రతిక రవిందర్ అని రతికరోజ్ రిప్లై ఇచ్చింది. ఇలా నెటిజన్లు అడిగిన వాటిలో కొన్నింటికి రిప్లై ఇచ్చింది ఈ బ్యూటీ.