English | Telugu
గుప్పెడంత మనసు సీరియల్ కి శుభం కార్డు.. సోషల్ మీడియాలో అభిమానుల రచ్చ!
Updated : Jul 28, 2024
గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ కొన్ని సంవత్సరాలుగా స్టార్ మా టీవీ అభిమానుల ఆదరాభిమానాలు పొందుతోంది. ఈ సీరియల్ కి ఫ్యాన్ బేస్ మాములుగా లేదు. రిషి సర్ ని మళ్ళీ తెప్పచడం కోసం ఫ్యాన్స్ కామెంట్లు చేస్తూ ఓ మినీ యుద్దమే చేసారు. అయితే ఇప్పుడు రిషి పాత్రని రంగాగా పరిచయం చేసిన దర్శకుడు కుమార్ పంతం.. ఇన్ స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ ని షేర్ చేశాడు.
సీరియల్ షూటింగ్ లో భాగంగా శైలేంద్ర, రిషిలతో కలిసి దిగిన కొన్ని ఫోటోలని దర్శకుడు కుమార్ పంతం షేర్ చేశాడు. అయితే ఈ పోస్ట్ కి గుప్పెడంత మనసు అభిమానులు ఓ రేంజ్ లో కామెంట్లు చేస్తున్నారు. దయచేసి ఈ సీరియల్ ని క్లోజ్ చేయొద్దు.. మా వసుధారని కాస్త నవ్వించే ఎపిసోడ్‌లు చేయండి... రిషి , వసుధారలని కలపండి అంటు కొందరు అభిమానులు కామెంట్ చేయగా.. మరికొందరు దర్శకుడు చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాడంటూ , రిషికి సపోర్ట్ గా మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. అభిమానులు ఇలా అనడానికి ఓ కారణం ఉంది. అదేంటంటే నిన్నటి శనివారం నాటి ఎపిసోడ్‌తో కొంత క్లారిటి వచ్చేసింది. VR అని అక్షరాలున్న ఎంగేజ్‌మెంట్ రింగ్‌ని బుజ్జిగాడితో వసుధారకి రంగా పంపించడంతో అతనే రిషి అనే విషయాన్ని చెప్పకనే చెప్తున్నాడు. ఇక రిషి వేషంలో రంగాగా శైలేంద్రని నమ్మిస్తూ.. డీబీఎస్టీ కాలేజ్ ఎండీగా అడుగుపెట్టబోతున్నాడు. మొత్తానికి రిషి.. డీబీఎస్టీ కాలేజ్‌కి ఎండీ కావడంతో పాటు.. వసుధారకి తాను రిషినే అనే నిజాన్ని చెప్పడం ద్వారా వీళ్ళిద్దరు కలిసిపోయినట్టే. మరోవైపు.. మను తన తండ్రి మహేంద్రే అని తెలుసుకున్నాడు. అనుపమ ఇంకా నోరు విప్పడం లేదు కానీ.. ఈరోజో రేపే చెప్పినా చెప్పేయొచ్చు. కాబట్టి.. అటు రిషి వసుధారలు కలవడం.. ఇటు మను తన తండ్రి గురించి తెలుసుకోవడంతో.. ‘గుప్పెడంత మనసు’ సీరియల్‌కి శుభం కార్డ్ పడుతుందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఈ సీరియల్ ని మరో వెయ్యి ఎపిసోడ్ లు లాగడానికి స్కోప్ ఉంది కానీ రిషి అలియాస్ ముకేశ్ గౌడ(Mukesh Gowda) కి వేరే ప్రాజెక్ట్స్ ఉన్నాయని అందుకే తన అగ్రిమెంట్ త్వరలోనే ముగుస్తుందని తెలుస్తోంది. అందుకే దర్శకుడు క్లైమాక్స్ ప్లాన్ చేశాడా అనే క్యూరియాసిటితో అభిమానులు తెగ కామెంట్లు చేస్తున్నారు. మరి నిజంగానే గుప్పెడంత మనసుకి శుభం కార్డు పడుతుందా లేదా తెలియాలంటే వేచి చూడాల్సిందే.