English | Telugu
టాప్ రేటింగ్ తో బ్రహ్మముడి.. సెకెండ్ పొజిషన్ లో ఏం ఉందంటే!
Updated : Jul 26, 2024
తెలుగు టీవీ సీరియల్స్ లో స్టార్ మా సీరియల్స్ కి ఉండే క్రేజే వేరు. స్టార్ మా టీవీలో ప్రైమ్ టైమ్ లో వచ్చే సీరియల్స్ కి ఉండే టీఆర్పీ మరే ఇతర సీరియల్ కి ఉండదు. ఇక ఈ వారం ఏ సీరియల్ ఏ స్థానంలో ఉందో ఓసారి చూసేద్దాం.
కొత్తగా మొదలైన సీరియల్స్ లో ఎటో వెళ్ళిపోయింది మనసు సీరియల్ దూసుకెళ్తుండగా.. పాత సీరియల్ నుండి నవ వసంతంగా వచ్చిన కార్తీకదీపం-2 ఎక్కువగా టీఆర్పీ తెచ్చుకోలేకపోతుంది. ఎందుకంటే దీపకి ఆల్రెడీ నరసింహాతో పెళ్ళి జరిగి శౌర్య అనే పాప కూడా ఉండటం.. కార్తిక్ కి జ్యోత్స్న అనే మరదలు ఉండటంతో.. డాక్టర్ బాబు, వంటలక్కల బాండింగ్ లేదా అనే డైలమాలో ఉన్నారు. దీనికి తోడు పారిజాతం చిన్నతనం చేస్తున్న కుట్రలు ఎవరికీ తెలియకపోవడం కథని బలహీనపరిచాయి. దాంతో తెలుగింటి మహిళలు ఈ సీరియల్ ని ఎక్కువగా చూడట్లేదు. అందుకేనేమో కొత్తగా వచ్చిన సీరియల్ ఇంటింటి రామాయణానికి టీఆర్పీ బాగుంటుంది.
బ్రహ్మముడి సీరియల్ కి అత్యధిక టీఆర్పీ 12.51 తో మొట్టమొదటి స్థానంలో ఉండగా.. కార్తీకదీపం-2 రెండవ స్థానంలో ఉంది. ఇక మూడవ స్థానంలో గుండె నిండా గుడిగంటలు, నాల్గవ స్థానంలో ఇంటింటి రామాయాణం ఉండగా కొత్తగా మొదలైన చిన్ని సీరియల్ అయిదవ స్థానంలో ఉంది. ఈ సీరియల్ ప్రారంభమై నెల కూడా కాకముందే ఇది టాప్-5 లో చోటు దక్కించుకుంది. ఇక టాప్- 10 లో గుప్పెడంత మనసు, ఎటో వెళ్ళిపోయింది మనసు చోటు దక్కించుకున్నాయి.