English | Telugu

ఆగిపోయిన ఎంగేజ్ మెంట్.. హాస్పిటల్ లో శౌర్య!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2' (Karthika Deepam 2). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -108 లో....నర్సింహా, అనసూయలు శౌర్యని తీసుకొని వెళ్లాడనికి వస్తారు. అనసూయ నర్సింహాని చూపించి ఇతనే మీ నాన్న అని చెప్తుంది.. కాదు బూచోడని శౌర్య అంటుంది. బూచోడే నాన్ననా అని దీపని శౌర్య అడుగుతుంది. దీప సైలెంట్ గా ఉండడంతో అందరు చెప్పమని అడుగుతారు. దాంతో దీప ఇన్ని రోజులుగా శౌర్యకి తెలియద్దనుకున్న నిజం చెప్పేస్తుంది. వాడే మీ నాన్న అని దీప అనగానే.. కాదంటూ భయంతో శౌర్య కళ్ళుతిరిగి కిందపడిపోతుంది. శౌర్య అంటూ దీప ఏడుస్తుంటే.. నా కూతురని చెప్పావ్ కదా.. ఇక నేను చూసుకుంటానని నర్సింహా పాపని ఎత్తుకొని వెళ్తుంటే.. దీప ఆపే ప్రయత్నం చేస్తుంది. అయిన నరసింహా ఆగకండా వెళ్తాడు.

ఆ తర్వాత కార్తీక్ వెళ్ళబోతుంటే జ్యోత్స్న ఆపుతుంది. అయిన వదులుకొని మరి వచ్చి.. నర్సింహా నుండి పాపని తీసుకుంటాడు కార్తిక్. ఇలా చేస్తావనే ఆ రోజు హాస్పిటల్ లో పాపకి తండ్రి అని చెప్తే వదిలేసి వెళ్తావ్ అనుకున్నాను కానీ ఇలా ప్రవర్తిస్తావనుకులేదని కార్తీక్ కోపంగా శౌర్యని తీసుకొని హాస్పిటల్ కి వెళ్తాడు. దీప కూడా వెళ్తుంది. భర్త నేను ఆ బిడ్డ తండ్రిని నేను‌. కానీ వాళ్ళు ముగ్గురు అలా వెళ్తుంటే.. ఎవరైనా ఎం అనుకుంటారని నర్సింహా అంటాడు. ఏం చేస్తానని ఏం చేసావ్ రా నర్సింహాని అనసూయ తిడుతుంది. ఆ తర్వాత జ్యోత్స్న ఎంగేజ్ మెంట్ రింగ్స్ ని పట్టుకొని పట్టరాని కోపంగా ఉంటుంది‌. అప్పుడే సుమిత్ర వాళ్ళు లోపలికి వెళ్తారు. అసలు సంబంధం లేని వారి వాళ్ళ ఎంగేజ్ మెంట్ ఆగిపోవడమేంటి ? ఎంగేజ్ మెంట్ ఆగిపోయిందని బాధ గ్రాణిలో తప్ప ఎవరి మొహం పైన కనపడడం లేదని జ్యోత్స్న కోప్పడుతుంది. మీకందరికి దీప కావాలి.. దీప కూతురు కావాలి.. వాళ్ళు సంతోషంగా ఉండడం కావాలి.. నేను మీకు అవసరం లేదు.. బావ ఎలా వదిలేసి వెళ్ళాడని జ్యోత్స్న అంటుంది. శౌర్య పరిస్థితి బాగోలేదు కదమ్మా అని సుమిత్ర అంటుంది. నువ్వు మాట్లాడకు.. అసలు నేను మీ కన్న కూతురినేనా అని జ్యోత్స్న అంటుంది. ఎంగేజ్ మెంట్ ఇప్పుడు ఆగిపోయింది. మళ్ళీ ముహూర్తం పెట్టించండి.. కచ్చితంగా మళ్ళీ జరుగుతుందని జ్యోత్స్న అంటుంది. ఆ తర్వాత కాంచనకి తల తిరిగినట్లు చేస్తుంటే సుమిత్ర వెళ్లి టాబ్లెట్ తెచ్చి ఇస్తుంది.

మరొకవైపు శౌర్యని హాస్పిటల్ కి తీసుకొని వెళ్తారు. అన్ని టెస్ట్ లు చేయాలి అంటాడు. ఇది వరకు ఎప్పుడైన ఇలా పడిపోయిందా అని డాక్టర్ అడుగగా.. పడిపోయిందని దీప చెప్తుంది. పాత రిపోర్ట్ తీసుకొని రండి అనగానే కార్తీక్ తెస్తానంటూ వెళ్తాడు. ఆ తర్వాత శౌర్య దగ్గరకి‌ సుమిత్ర వస్తుంది. కార్తీక్ పాత రిపోర్ట్ తీసుకోని వస్తాడు. ఏమైంది డాక్టర్ అని దీప అడుగుతుంది. రిపోర్ట్స్ వచ్చాక చెప్తానని డాక్టర్ అంటాడు. సుమిత్ర, దీపలు బయటకు వెళ్ళాక.. ఏమైంది డాక్టర్ అని కార్తీక్ అడుగగా.. మీరు ఒకసారి తర్వాత వచ్చి కలవండి.. మీతో మాట్లాడాలని డాక్టర్ అంటాడు. ఇలా మాట్లాడాలని అంటున్నారంటే ఏదో సీరియస్ అయి ఉంటుందని కార్తీక్ టెన్షన్ పడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.