English | Telugu
అందుకే బుల్లెట్ భాస్కర్ భార్య జంప్!
Updated : Jul 28, 2024
బుల్లెట్ భాస్కర్ పెళ్ళాం అందుకే పోయింది అంటూ నాటీ నరేష్ కామెంట్స్ చేసాడు. ఈ వారం శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో ఒక సెగ్మెంట్ పెట్టాడు ఆది. అదేంటంటే రివర్స్ స్కిప్పింగ్ అన్నమాట. అది ఎలా ఆడాలో నాటీ నరేష్ చేసి చూపించాడు. ఎలా ఆడకూడదో బులెట్ భాస్కర్ చూపించాడు. ఐతే నరేష్ ఆడి చూపించాక బులెట్ భాస్కర్ ని రమ్మని చెప్పాడు. "తమ్ముడు నేను భార్య పోయిన బాధలో ఉన్నా" అని చెప్పాడు భాస్కర్. "ఎం లేదు..ఎం భయంలేదు. నా మాట విను" అని ఆది అనేసరికి "నువ్వు కొత్త అల్లుడివి కాబట్టి ఈ గేమ్ శోభనానికి ముందు నీకు వామప్ అనుకో" అన్నాడు భాస్కర్ ఆ గేమ్ ఆడకుండా తప్పించుకోవడానికి. "ఇలాంటివి చాలా ఆడాంలే రా" అని భాస్కర్ ని బలవంతంగా తీసుకెళ్లాడు ఆది. "ఏంట్రా నరేష్ గా ఆడను అంటున్నాడు" అని ఆది అనేసరికి " ఏయ్ ఆడెహె" అన్నాడు నరేష్. తర్వాత భాస్కర్ తో ఆ గేమ్ ఆడించారు. భాస్కర్ హైట్ మూలాన ఆ గేమ్ ఆడలేక పడిపోయాడు. "ఇప్పుడు నాకు అర్థమయింది..ఇలా ఆడలేకే ఇందుకే పోయింది పెళ్ళాం.. ఈడు సంసారానికి పనికి రాడు" అని నరేష్ డిసైడ్ చేసేసాడు. "ఈడు ఇలా ఎగరలేకే పెళ్ళాం ఎగిరిపోయింది" అంటూ రోహిణి హాట్ కామెంట్స్ చేసింది. ఆ మాటలకూ భాస్కర్ ఒక చూపు చూసాడు...ఇలా ఈ గేమ్ లో భాస్కర్ ని బాగా ర్యాగింగ్ చేశారు.