English | Telugu
ఎన్టీఆర్, శ్రీదేవి కలిసి నటించిన "కొండవీటి సింహం" సినిమాలో "అత్తమడుగు వాగులోనా..." అనే పాట ఎంత హిట్టయ్యిందో అందరికి తెలిసిందే. అప్పట్లో ఈ పాట ఒక ఊపు ఊపింది అనడంలో ఎలాంటి అనుమానం లేదు. అలాంటి ఈ పాటను మనవడు జూ.ఎన్టీఆర్ తన చిత్రం కోసం రీమేక్ చేస్తున్నాడు.
నిర్మాత దిల్ రాజు ఇదివరకే "కలిసి ఉంటే కలదు సుఖం" అనే టైటిల్ ను ఫిల్మ్ చాంబర్ లో రిజిస్టర్ చేయించాడు. "ఓ మై ఫ్రెండ్" వంటి చిత్రంతో దర్శకుడిగా పరిచయమయిన వేణు శ్రీరామ్ దాదాపు రెండు సంవత్సరాలు కష్టపడి ఓ స్క్రిప్ట్ సిద్ధం చేశాడట.
క్యాడ్బరీ చనిపోయింది. అదేంటి క్యాడ్బరీ చాక్లెట్ చనిపోవడమేంటి అని అనుకుంటున్నారా? క్యాడ్బరీ అంటే తినే చాక్లెట్ కాదు. అది ఒక కుక్క పేరు. ఆ కుక్క హీరోయిన్ త్రిషది. త్రిషకు క్యాడ్బరీ అంటే చాలా ఇష్టం.
అల్లరి నరేష్ హీరోగా ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్నది. ఈ చిత్రానికి "బందిపోటు" అనే టైటిల్ ను ఖరారు చేసినట్లు తెలిసింది. నరేష్ అంటేనే అల్లరి.
"సూపర్" సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ అయేషా టాకియా. ఆ తర్వాత పలు హిందీ చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. అయితే ఈ అమ్మడు 2009లో ప్రముఖ బిజినెస్‌మేన్ ఫర్హాన్ అజ్మిను వివాహం చేసుకుంది.
మహేష్ హీరోగా నటిస్తున్న చిత్రం "1". ఈ చిత్రంలో మహేష్ తనయుడు గౌతమ్ కూడా ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. అయితే ఈ చిత్రానికి సంబంధించిన డబ్బింగ్ కార్యక్రమాలు శబ్దాలయ స్టుడియోలో జరుగుతున్నవి.
మహేష్ హీరోగా నటిస్తున్న చిత్రం "1". ఈ చిత్రంలో మహేష్ తనయుడు గౌతమ్ కూడా ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. అయితే ఈ చిత్రానికి సంబంధించిన డబ్బింగ్ కార్యక్రమాలు శబ్దాలయ స్టుడియోలో జరుగుతున్నవి. ఇందులో మహేష్, గౌతమ్ లు కలిసి డబ్బింగ్ పనుల్లో పాల్గొంటున్నారు.
అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య, అఖిల్ కలిసి నటిస్తున్న చిత్రం "మనం". ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. త్వరలోనే మరో షెడ్యుల్ మైసూరులో ప్రారంభించనున్నారు.
సినిమాల్లో రియల్ స్టంట్స్ చేసే మంచు హీరో మనోజ్ తాజాగా కారు ప్రమాదం నుండి బయటపడ్డాడు. జూబ్లీహిల్స్ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్తున్న మనోజ్, ఔటర్‌రింగ్ రోడ్డు సమీపంలోని అప్పా జంక్షన్ వద్ద గేదెలు అడ్డురావడంతో కారు సడన్ బ్రేక్ వేశాడు. దాంతో కారు అదుపుతప్పి పల్టీలు కొట్టింది
ఇప్పుడున్న హీరోయిన్లకు పోటీగా తన అందాలతో సమాధానం చెపుతూ, హీరోయిన్ గా ఎదగడానికి ప్రయత్నాలు చేస్తున్న హాట్ పోర్న్ స్టార్ సన్నీ లియోన్ హైదరాబాద్ రసిక అభిమానులను మోసం చేసింది. ఈ అమ్మడు ఎక్కడికెళ్ళినా కూడా తన అందచందాలతో అక్కడున్న వారిలో సెగలు పుట్టించకుండా ఉండదు.
"అతడు" సినిమాలో మహేష్ ను "ఆడు మగాడ్రా బుజ్జి" అని అంటే ఆ డైలాగ్ సూపర్ హిట్టయింది. అదే డైలాగ్ పేరుతో మహేష్ బావ సుధీర్ హీరోగా తెరకెక్కింది. ఈ సినిమా నేడే విడుదలైంది.
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం "రేసుగుర్రం". అల్లు అర్జున్, శృతిహాసన్ జంటగా నటిస్తున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్ వీడియోను నేడు(డిసెంబర్ 7) దర్శకుడి పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసారు.
ఈమధ్య తెలుగు సినిమా షూటింగ్స్ అన్ని కూడా దాదాపు బ్యాంకాక్ లో జరుగుతున్నాయి. కానీ మొట్టమొదటిసారిగా బ్యాంకాక్ లో తెలుగు ఆడియో విడుదల కార్యక్రమం జరగబోతుంది.
"అతనొక్కడే", "కిక్", "ఊసరవెల్లి" వంటి హిట్ చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు సురేందర్ రెడ్డి పుట్టినరోజు నేడు. ప్రస్తుతం ఈయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం "రేసుగుర్రం".
"జులాయి" చిత్రం తరువాత అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో మరో చిత్రం తెరకెక్కబోతుంది. "అత్తారింటికి దారేది" వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం తర్వాత త్రివిక్రమ్ మరోసారి తన మార్క్ స్టైల్ కొత్తదనాన్ని ఈ చిత్రంలో చూపించనున్నాడు.