English | Telugu

నాగ్ లవర్ తల్లయింది

"సూపర్" సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ అయేషా టాకియా. ఆ తర్వాత పలు హిందీ చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. అయితే ఈ అమ్మడు 2009లో ప్రముఖ బిజినెస్‌మేన్ ఫర్హాన్ అజ్మిను వివాహం చేసుకుంది. ఈ అమ్మడికి ఈ నెల 6న పండంటి మగబిడ్డ పుట్టాడు. ఈ సందర్భంగా తనను అభినందించిన అభిమానులు, శ్రేయోభిలాషులకు ఆయేషా కృతజ్ఞతలు తెలిపింది. అదే విధంగా తన చిన్నారిని ఆశీర్వదించాల్సిందిగా కోరింది.