English | Telugu
మరదలితో ఎన్టీఆర్ వాగులో రొమాన్స్...!
Updated : Dec 11, 2013
ఎన్టీఆర్, శ్రీదేవి కలిసి నటించిన "కొండవీటి సింహం" సినిమాలో "అత్తమడుగు వాగులోనా..." అనే పాట ఎంత హిట్టయ్యిందో అందరికి తెలిసిందే. అప్పట్లో ఈ పాట ఒక ఊపు ఊపింది అనడంలో ఎలాంటి అనుమానం లేదు. అలాంటి ఈ పాటను మనవడు జూ.ఎన్టీఆర్ తన చిత్రం కోసం రీమేక్ చేస్తున్నాడు. ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం "రభస". సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఆ పాటను రీమేక్ చేస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని 2014 మర్చి 28న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన సమంత, ప్రణీత హీరోయిన్లుగా నటిస్తున్నారు. మరి ఈ పాటలోని అత్త కూతురిగా ఎవరు తారక్ తో రొమాన్స్ చేయనున్నారో త్వరలోనే తెలియనున్నది.