English | Telugu

సుఖం కోసం రెడీ అవుతున్న నిర్మాత

నిర్మాత దిల్ రాజు ఇదివరకే "కలిసి ఉంటే కలదు సుఖం" అనే టైటిల్ ను ఫిల్మ్ చాంబర్ లో రిజిస్టర్ చేయించాడు. "ఓ మై ఫ్రెండ్" వంటి చిత్రంతో దర్శకుడిగా పరిచయమయిన వేణు శ్రీరామ్ దాదాపు రెండు సంవత్సరాలు కష్టపడి ఓ స్క్రిప్ట్ సిద్ధం చేశాడట. ఈ స్క్రిప్ట్ కు ఈ టైటిల్ ను ఖరారు చేసారని తెలిసింది. అయితే ఈ చిత్రంలో నటించడానికి ఒక స్టార్ హీరో కోసం దిల్ రాజు ప్రయత్నిస్తున్నాడట. 2014 సంక్రాంతి వరకే ఈ ప్రాజెక్ట్ ను ఫైనలైజ్ చేయాలనీ దిల్ రాజు భావిస్తున్నడని తెలిసింది.

ప్రస్తుతం రాంచరణ్ హీరోగా, దిల్ రాజు నిర్మించిన "ఎవడు" చిత్రం ఇంకా విడుదలకు నోచుకోలేదు. ఈ చిత్రంపైనే దిల్ రాజు చాలా ఆశగా ఉన్నాడు. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు.