English | Telugu

ఆ బందిపోటు అల్లరోడేనా...?

అల్లరి నరేష్ హీరోగా ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్నది. ఈ చిత్రానికి "బందిపోటు" అనే టైటిల్ ను ఖరారు చేసినట్లు తెలిసింది. నరేష్ అంటేనే అల్లరి. మరి ఈ అల్లరోడి సినిమాకు ఈ టైటిల్ ఎలా సెట్ అవుతుంది. అసలు ఇది కామెడి సినిమాయేనా అనే అనుమానాలు వస్తున్నాయి. మరి ఈ చిత్రం గురించి చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా తెలియజేస్తే తప్ప, ఈ అనుమానాలకు తెరపడేలా లేదు. అయితే ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందట. వచ్చే నెలలో సెట్స్ పైకి వెళ్లనుందని తెలిసింది.