English | Telugu
బ్యాంకాక్ లో సుమంత్ గుర్రం కూత
Updated : Dec 7, 2013
ఈమధ్య తెలుగు సినిమా షూటింగ్స్ అన్ని కూడా దాదాపు బ్యాంకాక్ లో జరుగుతున్నాయి. కానీ మొట్టమొదటిసారిగా బ్యాంకాక్ లో తెలుగు ఆడియో విడుదల కార్యక్రమం జరగబోతుంది. సుమంత్ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం "ఏమో గుర్రం ఎగరవచ్చు". ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమాన్ని ఈ నెల 10వ తేదిన బ్యాంకాక్ లో విడుదల చేయనున్నారు. చంద్రసిద్ధార్థ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సుమంత్ సరసన పింకీ సావిక హీరోయిన్ గా నటిస్తుంది. చెర్రీ ఫిలిమ్స్ పతాకంపై పూదోట సుధీర్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.