English | Telugu
Bigg Boss 9 Nominations Tenth Week : బిగ్ ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్.. పదో వారం నామినేషన్లో ఉంది ఎవరంటే!
Updated : Nov 11, 2025
బిగ్ బాస్ సీజన్-9 లో పదో వారం నామినేషన్ల ప్రక్రియ త్వరగా పూర్తి అయింది.ఇమ్మాన్యుయల్, భరణి ని నామినెటే చేసాడు. దివ్యని రీతు నామినేట్ చేయగా నిఖిల్ ని కళ్యాణ్ నామినేట్ చేశాడు. ఆ తర్వాత సంజన, దివ్యలని గౌరవ్ నామినేట్ చేసాడు. నిఖిల్ ని సుమన్ శెట్టి నామినేట్ చేశాడు. గౌరవ్ ని తనూజ నామినేట్ చేసింది.ఆ తర్వాత గౌరవ్ ని డీమాన్ పవన్ నామినేట్ చేశాడు. దివ్యని భరణి నామినేట్ చేయగా, సంజన -గౌరవ్ ని, నిఖిల్ -రీతూ ని నామినేట్ చేసాడు.
అయితే నామినేషన్ ప్రక్రియ ముగిసాక బిగ్ బాస్ ట్విస్ట్ ఇచ్చాడు. ఇప్పటివరకు జరిగిన ప్రక్రియలో నామినేట్ అయినా వాళ్లంతా నామినేషన్ లో ఉంటారని అనుకుంటున్నారు కదా అలా ఏం కాదు.. హౌస్ మొత్తం ఈ వీక్ నామినేషన్ లో ఉంటారని బిగ్ బాస్ బిగ్ ట్విస్ట్ ఇచ్చాడు. ఇమ్మాన్యుయల్ కెప్టెన్ అయిన తనకి ఇమ్మ్యూనిటీ ఉండదు కానీ మీరందరు ఓటేసి చెప్పండి తనకి ఇమ్మ్యూనిటి కావాలో వద్దో అని బిగ్ బాస్ చెప్తాడు.
హౌస్ లో ఉన్నావాళ్లంతా ఒక్కోక్కరిగా వెళ్లి ఇమ్మాన్యుయల్ కి ఓటు వేస్తారు.. ఒక్క భరణి తప్ప అందరు కూడా ఇమ్మాన్యుయల్ కి ఇమ్మ్యూనిటి కావాలని ఓటు వెయ్యడంతో ఇమ్మాన్యుయల్ కి ఇమ్మ్యూనిటీ వచ్చి ఈ వీక్ కూడా నామినేషన్ నుండి సేవ్ చేస్తారు. ఈ వీక్ లో ఒక్క ఇమ్మాన్యుయల్ తప్ప అందరు నామినేషన్ లో ఉన్నారు.. ఇప్పుడు ఓటింగ్ ని బట్టి విన్నర్ ఎవరో కూడా ఈజీగా తెలిసిపోతుంది. మరి మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి.