English | Telugu
Bharani vs Divya : దివ్య వర్సెస్ భరణి.. మీ బాండింగ్ వల్లే బయటకు పోయాను!
Updated : Nov 11, 2025
బిగ్ బాస్ సీజన్-9 మొత్తం బాండింగ్ చుట్టే తిరుగుతుంది. బాండింగ్ వాళ్ళ ఎలిమినేట్ అయి మళ్ళీ రీఎంట్రీ ఇచ్చి మళ్ళీ బాండింగ్స్ తో ఉంటూ భరణి తన గేమ్ ని స్పాయిల్ చేసుకుంటున్నాడు. కానీ ప్రతీ సారి ప్రతీనోటా బాండింగ్ అనే పదం విని భరణికి కోపం వచ్చింది.. అందుకే ఆ కోపాన్ని మొత్తం నామినేషన్ లో పెట్టి తన విశ్వరూపం చూపించాడు భరణి.
భరణి తన నామినేషన్ గా దివ్యని చేస్తాడు.. నన్ను ఇంట్లో నుండి పంపించడానికి మీరు ఏం కారణం చెప్తున్నారని భరణిని దివ్య అడుగుతుంది. నేను హౌస్ లో నుండి బయటకు వెళ్ళడానికి కారణం బాండింగ్ అన్నారు కానీ ఆ బాండింగ్ అనే ఆలోచన పోగొట్టే బాధ్యత నీది కూడా కానీ అది అలాగే కంటిన్యూ చేస్తూ అందరికి ఆ ఆలోచన ఉండిపోయిందని భరణి చెప్తాడు. బాండింగ్ అంటే నన్ను ఒక్కదాన్నే అన్లేదు కదా నన్ను మాత్రమే నామినేట్ చేసి ఎందుకు చెప్తున్నారని దివ్య కోపంగా మాట్లాడుతుంది. అందరికి టైమ్ వచ్చినప్పుడు చెప్తానంటూ భరణి వాయిస్ రేజ్ చేస్తాడు.
ఇప్పుడు చెప్పండి మీరు నా వల్ల ఇంట్లో నుండి బయటకు వెళ్ళారా అని దివ్య స్టైట్ గా అడుగుతుంది. నీ వల్ల అనట్లేదు.. బాండింగ్ వల్ల అని చెప్తున్నానని భరణి అంటాడు. ఈ రీజన్ తో నన్ను మొదటి వారం నామినేట్ చేశారు కానీ ఇంత వరకు ఎవరు చెయ్యలేదని దివ్య ఎమోషనల్ గా మాట్లాడుతుంది. ఇక భరణి, దివ్య మధ్య ఎమోషనల్ బాండింగ్ కాదు అసలు బాండింగే లేదని భరణి నిరూపించుకోగలడా లేదా అనేది తెలియాల్సి ఉంది.