English | Telugu
Bigg Boss 9 Telugu Winner : బిగ్ బాస్ సీజన్-9 విజేత పవన్ కళ్యాణ్.. రన్నర్ గా తనూజ!
Updated : Nov 12, 2025
బిగ్ బాస్ సీజన్-9 లో ఇప్పటికే తొమ్మిది వారాలు పూర్తయ్యాయి. తొమ్మిదో వారం రాము రాథోడ్, సాయి శ్రీనివాస్ ఎలిమినేట్ అయ్యారు. ఇక హౌస్ లో ఈ వారం మొత్తం పదకొండు మంది ఉండగా ఇమ్మాన్యుయల్ ఒక్కడు తప్ప అందరు నామినేషన్లో ఉన్నారు. మరి ఈ వారం ఎవరు ఎలిమినేషన్ అవుతారో తెలియాల్సి ఉంది.
హౌస్ లోని కంటెస్టెంట్స్ లో ఇప్పటి వరకు జెన్యున్ గా ఉన్నవారిలో సుమన్ శెట్టి, దివ్య ఉన్నారు. ఇక ఇమ్మాన్యుయల్, రీతూ, తనూజ కొన్ని సందర్భాలలో కన్నింగ్ అనిపిస్తోంది. సంజనకి అయితే బిగ్ బాస్ మావ స్పెషల్ కోటా ఇచ్చినట్టు గా తను ఏం చేసినా చేయకపోయినా హౌస్ లోనే ఉంచుతున్నారు. డీమాన్ పవన్ కి ఆడే సత్తా ఉంది.. అయితే రీతూతో లవ్ ట్రాక్ వల్ల అతని గేమ్ కనపడటం లేదు. తనూజ హౌస్ లో ఎంతమందితో గొడవ పెట్టుకున్నా, కన్నింగ్ గా మాట్లాడినా, స్ట్రాటజీలు ప్లే చేసినా అవేం చూపించకుండా తనని ఎవరు నామినేట్ చేసిన వారిదే తప్పు ఉన్నట్టుగా బిగ్ బాస్ బయటకు చూపిస్తున్నాడు.
ప్రేక్షకుల ఓటింగ్, టాస్కుల్లో ప్రదర్శనలను బట్టి చూస్తే సంజనకి టాప్-5 కష్టమే. ఇమ్మాన్యుయల్, పవన్ కళ్యాణ్, తనూజ, భరణి, సుమన్ శెట్టి లు ఖచ్చితంగా టాప్-5లో ఉండే అవకాశం ఎక్కువగా ఉందని తెలుస్తోంది. రీతూ చౌదరి కూడా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయితే తను టాప్-5లో ఉంటుందా ఉండదా అనేది డౌట్. అయితే టైటిల్ రేసులో మాత్రం తనూజ, పవన్ కళ్యాణ్, ఇమ్మాన్యుయల్ ఉన్నారు. ఎక్కువ శాతం మంది కళ్యాణ్, తనూజ ఇద్దరిలో ఎవరో ఒకరు విన్నర్ అని అంటున్నారు. రాబోయే వారాల్లో ఎవరి ఆటతీరు ఎలా ఉంటుందో ఓటింగ్ ఎలా ఉంటుందో చెప్పలేం.. ఎలాగైనా మారొచ్చు. ఎలిమినేషన్లు, సీక్రెట్ టాస్కులతో టాప్- 5 లిస్ట్ లోనూ మార్పులు చోటు చేసుకోవచ్చు. అయితే బిగ్ బాస్ విన్నర్ తనూజ అని, రన్నర్ పవన్ కళ్యాణ్ అని మెజారిటీ ఆడియన్స్ అనుకుంటున్నారు.