English | Telugu
Bigg Boss 9 Telugu 10th week: పోరాడిన సుమన్ శెట్టి.. సంజన గెలుపు.. సంఛాలక్ గా కళ్యాణ్ ఫెయిల్!
Updated : Nov 12, 2025
బిగ్ బాస్ సీజన్-9 లో పదో వారం బీబీ రాజ్యం అనే టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఈ వారం అంతా ఇదే సాగుతుంటుంది. అయితే నిన్న జరిగిన మొదటి టాస్క్ లో సంజన ఓడిపోతుంది దాంతో సుమన్ శెట్టి తో మరో గేమ్ ఆడాల్సి వస్తుంది. కమాండర్ ఎంచుకున్న సభ్యుడు కమాండర్ అవ్వడానికి బిగ్‌బాస్ పెట్టిన పోటీ 'బిల్డ్ ఇట్ టూ విన్ ఇట్'.. ఈ పోటీలో కమాండర్ సంజన విజయం సాధిస్తే తన స్థానాన్ని కాపాడుకోగలుగుతుంది. ఒకవేళ ఓడిపోతే గెలిచిన సభ్యులు కొత్త కమాండర్ అవుతారన్నమాట.. ఈ పోటీలో గెలవడానికి పోటీదారులు బజర్ మోగగానే తమకి కేటాయించిన బాక్సులని ఒక్కొక్కటిగా తీసుకొని స్క్వేర్ లోపల ఒక బాక్సుపై మరో బాక్సు ఉండేలా ప్లేస్ చేసి టవర్‌ని నిర్మించాలి.. బజర్ మోగే సరికి ఎవరి టవర్ ఎత్తుగా ఉంటుందో వాళ్లు ఈ పోటీలో గెలిచి కమాండర్ అవుతారు.. ఈ టాస్కుకి కళ్యాణ్ సంఛాలక్ అని బిగ్‌బాస్ చెప్పాడు.
సంజనకి సుమన్ శెట్టి ఫుల్ పోటీ ఇస్తూ బాక్సు మీదకి బాక్సు ఎగరేసి మరీ నిలబెట్టాడు. దీంతో సుమన్ ఆట చూసి అందరు క్లాప్స్ కొడుతూ సపోర్ట్ చేశారు. అలా చివరికి సంజన-సుమన్ ఇద్దరు ఒకే ఎత్తులో టవర్ కట్టేశారు. దీంతో కళ్యాణ్‌కి ఏం డెసిషన్ తీసుకోవాలో అర్థం కానీ పరిస్థితి వచ్చింది. దీంతో టవర్ ఎప్పుడైనా స్ట్రయిట్‌గా ఉండాలనుకుంటాం.. అలానే సంజన గారు నిర్మించిన టవర్ స్ట్రయిట్‌గా స్ట్రాంగ్‌గా పర్ఫెక్ట్‌గా ఉంది కనుక అని కళ్యాణ్ తన డెసిషన్ చెప్పబోయాడు. ఇంతలో టవర్ ఏ పొజిషన్‌లో ఉన్నా ఫర్లేదు అన్నావ్ కదా అంటూ తనూజ అడిగింది. నేను వాళ్ల గేమ్‌లో స్పిరిట్ పెంచడానికి అలా చెప్పాను.. ఇస్తానా ఇవ్వనా అనేది నా డెసిషన్.. మీరు ఒకరికి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి అలానే చూస్తారు.. కానీ నేను ఇద్దరివీ చూడాలంటూ కళ్యాణ్ చెప్పాడు. అలా అయితే లాస్ట్ బాక్స్ ఆయనే ముందు పెట్టాడు కదా అప్పుడు ఆయనదే ఎక్కువసేపు స్టేబుల్‌గా ఉన్నట్లు కదా అంటూ దివ్య కూడా అడిగింది. అయినా కానీ ఇది నా డెసిషన్ అంటూ కళ్యాణ్ గట్టిగా నిలబడ్డాడు. ఇక కళ్యాణ్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తనూజ గట్టిగా గొడవ చేసింది.
కళ్యాణ్ నువ్వు ముందు చెప్పాల్సింది.. స్ట్రయిట్‌గా ఉండాలని. నీకు నచ్చినట్లు చెప్పేసి ఇప్పుడు మారుస్తానంటే ఎలా కుదురుతుందంటూ తనూజ అంది. దీంతో ఇదిగో నీకు సగం సగం అర్థమైందని అలా చెప్పకు.. నీకు ఇష్టమొచ్చినట్లు చెప్తే వినడానికి రెడీగా ఎవడూ లేడిక్కడ అంటూ కళ్యాణ్ సీరియస్ అయ్యాడు. నువ్వు చెప్పిన మాట మీద లేవు కళ్యాణ్.. గేమ్ స్టార్ట్ అయ్యే ముందు చెప్పిన పాయింట్ వేరు.. అయిపోయాక చెప్తున్న మాటలు వేరు అని తనూజ వాయిస్ రేజ్ చేసింది. నీకు అదే చెప్తున్నా తనూజ.. అదే వద్దు.. సంఛాలక్ గా నా డెసిషన్ ఫైనల్ అంటూ కళ్యాణ్ అన్నాడు. ఇక ఇద్దరి మధ్య చాలాసేపు గొడవ సాగింది. సరే అయితే కూర్చో.. నేను అది ఇవ్వను.. కూర్చో నేను ఇవ్వను తనూజ.. అంటూ కళ్యాణ్ ఫైర్ అయ్యాడు. దీంతో ఫెయిల్ సంఛాలక్.. అంటూ తనూజ అరిచింది. వెరీ గుడ్ నైస్ స్టేట్‌మెంట్ అంటూ కళ్యాణ్ సీరియస్ అయ్యాడు. పెట్టుకో.. ఇచ్చుకో.. అంటూ తనూజ సెటైర్లు వేసింది. దీంతో సంజన గెలిచిందంటూ కళ్యాణ్ చెప్పేసి నిలబెట్టిన బాక్సుల్ని తనూజ మీద కోపంతా గట్టిగా గుద్దిపడగొట్టాడు.