English | Telugu

Bigg Boss 9 Telugu: చెత్త నామినేషన్ తో కంగుతున్న రీతూ.‌‌. వ్యాలిడ్ రీజన్ ఇచ్చిన దివ్య!

బిగ్ బాస్ సీజన్-9 లో పదో వారానికి గాను నామినేషన్ ప్రక్రియ మొదలైంది. ఇందులో హీటెడ్ ఆర్గుమెంట్స్ జరిగాయి. మొదటగా భరణిని ఇమ్మాన్యుయల్ నామినేట్ చేయగా, ఆ తర్వాత రీతూ తన నామినేషన్ గా దివ్య పేరు చెప్పింది. గత వారం కెప్టెన్సీ టాస్క్ లో నీ మైండ్ లో ఇమ్మాన్యుయల్ గెలిపించాలని ఉన్నప్పుడు సపోర్ట్ చెయ్.. ఒకే కానీ ఒకరి దగ్గరికి వెళ్లి రీతూని తీసెయ్యాలి ఒకరి దగ్గరికి వెళ్లి తనూజ అన్నావ్ ఇలా అందరిని నీ గ్రిప్ లో ఉంచుకున్నావ్.. వారిని బాణాల్లా వదులుతున్నావని రీతూ అంది.

అందరు నువ్వు చెప్తే వింటున్నారు.. నువ్వు అది చెయ్, ఇది చెయ్, ఇలా ఎవరికి ఏం చెప్పినా అది వాళ్ళు వింటున్నారని రీతూ చెప్తుంది. వాళ్లు వింటే నీకేం ప్రాబ్లమ్ అవుతుంది. నీకు భయం వేస్తుందా అని దివ్య అంటుంది. నాకు భయం కాదు.. అందరు నేను చెప్తే వింటున్నారు.. నాకే తెలుసు.. నాకు మాత్రమే తెలుసన్న భ్రమలో ఉంటావ్ కదా.. అది వదిలేయ్ అని రీతూ స్టేట్ గా చెప్తుంది.

రీతూ, దివ్యకి గొడవ భారీ ఎత్తునే జరుగుతుంది. గతవారం ఓ చెత్త రీజన్ తో నామినేట్ చేసిన రీతూ.. ఈ వారం మరో వ్యాలిడ్ లేని క్వశ్చన్స్ అడిగింది. దివ్య గేమ్ అనేది తన పర్సనల్.. ‌కానీ రీతూ కంటే సేఫ్ ప్లే ఎప్పుడూ ఆడలేదు.. తనూజ, కళ్యాణ్ లని పాజిటివ్ చేయడానికి దివ్యని నెగెటివ్ చేస్తే దానిని నమ్మిన రీతూ రోత పాయింట్లతో చెత్త నామినేషన్ చేసింది.

ఆ తర్వాత రీతూని నిఖిల్ నామినేట్ చేస్తాడు. నువ్వు నా దగ్గరికి వచ్చి వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చావ్.. నీకు గేమ్ ఆడే పోటెన్షియల్ లేదు.. వేస్ట్ అన్నావ్ అని నిఖిల్ చెప్తాడు. చాలా బ్యాడ్ అవుతావు నిఖిల్.. నేను బ్యాడ్ అనే వర్డ్ వాడలేదని రీతూ డిఫెన్స్ చేసుకుంటుంది. మరి వీరిద్దరిలో ఎవరు కరెక్ట్ కామెంట్ చేయండి.