English | Telugu

Bigg Boss 9 Telugu 10th week:  బీబీ రాజ్యంలో కంటెస్టెంట్స్.. రాజు, రాణులు, ప్రజలు ఎవరంటే!

బిగ్ బాస్ సీజన్-9 లో పదో వారం పది మంది కంటెస్టెంట్స్ నామినేషన్లో ఉన్నారు. ‌ఇక ఈ వారం కెప్టెన్సీ టాస్క్ లు జరుగుతున్నాయి. నిన్నటి ఎపిసోడ్ లో ఏం జరిగిందో ఓసారి చూసేద్దాం.

ఈ వారం కంటెస్టెంట్స్ అందరిని డివైడ్ చేసి.. బిబి రాజ్యంగా చేశాడు బిగ్ బాస్. రీతూ, కళ్యాణ్, దివ్య ఈ వారానికి బీబీ రాజ్యానికి రాజు, రాణులు.. వీళ్లకి ఈ ఇంట్లో ప్రత్యేకమైన విలాసాలు లభిస్తాయి.. వీరికి బెడ్‌రూమ్‌‌లో నివసించే హక్కు ఉంది.. అలాగే పూర్తి ఇంటికి యాక్సెస్ కూడా లభిస్తుందంటూ చాలానే వరాలు ఇచ్చాడు బిగ్‌బాస్. ఇక మరో ముఖ్యమైన ప్రయోజనం ఏంటంటే వీళ్లకి ఇమ్యూనిటీ గెలుచుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది. అలా అని వీళ్లు సేఫ్ అని అనుకోవడానికి లేదు. ఎందుకంటే వీళ్లని ఓడించి ఆ స్థానాన్ని సొంతం చేసుకోవడానికి మిగతావారికి కూడా అవకాశం లభించనుంది.. ఇలా వారం ముగిసేసరికి అందరిలో ఒక్కరే ఇమ్యూనిటీ పొందుతారు.. ఆ ఒక్కరే ఈ ఇంటి కెప్టెన్ అవుతారని బిగ్‌బాస్ చెప్పాడు. ఇక రాజు, రాణులు కలిసి ఇంటి సభ్యులందరిని నలుగురు కమాండర్స్‌గా అలానే నలుగురు ప్రజలుగా విభజించాలని బిగ్‌బాస్ చెప్పాడు. కమాండర్స్‌కి కూడా కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. వారికి కూడా ఇమ్యూనిటీ పొందే అవకాశం ఉంది. ఇక ప్రజలకి ఎలాంటి అవకాశం లేదు.. అలానే ఇంటి పని అంతా వాళ్లే చేయాల్సి ఉంటుంది. ఇక పవర్ రాగానే దివ్య-రీతూ మాములు ఎక్స్‌ట్రాలు చేయలేదు. ఒక్కొక్కరిని పిలిచి ఇంటర్వ్యూలు చేసినట్లుగా కొశ్చన్స్ అడిగారు. చివరికి కమాండర్లుగా నిఖిల్, సంజన, తనూజ, డీమాన్‌లని సెలెక్ట్ చేశారు. దీంతో కమాండర్స్ ఇప్పటినుంచి రోజ్ రూమ్‌లో ఉంటారు.. ప్రజలు మాత్రం బయట డెన్‌లో ఉండాలని బిగ్‌బాస్ చెప్పాడు. అలానే రాజు, రాణులు, కమాండర్స్ ఇంట్లో ఎలాంటి పనులు చేయాల్సిన అవసరం లేదు. పూర్తి పనులన్నీ ప్రజలు అయిన భరణి , ఇమ్మాన్యుయల్, సుమన్ శెట్టి, గౌరవ్ మాత్రమే చేయాలని బిగ్ బాస్ చెప్పాడు.

కాసేపటి తర్వాత భరణిని పిలిపించుకొని హెడ్ మసాజ్ చేయించుకుంది దివ్య. నాకు కొంచెం తలకాయ నొప్పిగా ఉంది భరణి గారిని పిలిచి హెడ్ మసాజ్ చేయించండి అంటూ డీమాన్‌కి దివ్య ఆర్డర్ వేసింది. దీంతో భరణిని పిలిపించి హెడ్ మసాజ్ చేయించాడు డీమాన్. అక్కడ కాసేపు సరదాగా సాగింది.

Podharillu:పొదరిల్లు సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. మహాలక్ష్మికి పెళ్ళి ఫిక్స్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -02 లో.....మహాలక్ష్మి ప్రాజెక్ట్ డిజైన్ రెడీ చేసి హాల్లోకి వస్తుంది. వాళ్ళ నాన్న ప్రతాప్ ఇంకా అన్నయ్య మహాలక్ష్మికి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తారు. ఒకసారి చూడు మహా అని వాళ్ళ అన్నయ్య అంటాడు. నాకేం ఇప్పుడు పెళ్లి వద్దు అవసరం అయితే వదిన నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోండి అని మహా అంటుంది. ఇప్పుడు డిజైన్స్ చూపించడానికి వెళ్తున్నానని తెలిస్తే డాడీ వద్దని అంటాడనుకొని డాడీ కాలేజీలో సర్టిఫికెట్ ఉన్నాయి తెచ్చుకుంటానని చెప్తుంది.