హంసా హొయలు అదుర్స్!
మిర్చి.. మిర్చి.. మిర్చి లాంటి కుర్రాడే.. అంటూ ప్రభాస్ 'మిర్చి' కోసం హాట్ హాట్ గా కనిపించి కుర్రకారు గుండెల్లో హీట్ పుట్టించిన బ్యూటీ హంసా నందిని. హీరోయిన్గా రాని సక్సెస్ మిర్చి ఐటమ్ సాంగ్తో అమ్మడి సొంతమైంది. ఆ ఊపులోనే అత్తారింటికి దారేది, రామయ్యా వస్తావయ్యా, భాయ్, లెజెండ్ తదితర చిత్రాల కోసం ప్రత్యేక గీతాల్లో కనువిందు చేసిందీ అందం.