English | Telugu
ఛార్మి డబుల్ ధమాకా
Updated : Jun 8, 2015
గ్లామర్ రోల్స్ అంటే గుర్తొచ్చే హీరోయిన్స్‌లో ఛార్మింగ్ బ్యూటీ ఛార్మి ఒకరు. టాప్ హీరోల పక్కన గ్లామరసాన్ని ఒలికిస్తూ ఆడిపాడినా.. హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాల్లో గ్లామర్‌గా కనిపిస్తూనే పెర్‌ఫార్మెన్స్‌ని చూపెట్టినా ఆమెని సక్సెస్‌లు బాగానే వరించాయి. ఇదిలా ఉంటే.. ఈ అందాల తార కేవలం వారం గ్యాప్‌లో రెండు హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్‌తో సిల్వర్ స్క్రీన్‌పై సందడి చేయనుంది. ఈ నెల 12న పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో తెరకెక్కిన జ్యోతిలక్ష్మీతో పలకరించనున్న ఈ సుందరి.. జూన్ మూడో వారంలో మంత్ర 2తో ఆడియన్స్ ముందుకు రానుంది. ఓ హీరోయిన్ నటించిన రెండు సినిమాలు వారం రోజుల గ్యాప్‌లో ప్రేక్షకుల ముందుకు రావడంలో పెద్ద విశేషమేమిలేదు కానీ.. ఆ రెండు కూడా హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలు కావడంతోనే ఛార్మి వార్తల్లో నిలుస్తోంది. ఆల్ ది బెస్ట్ ఛార్మి!