English | Telugu

'అత్తారింటికి..'అక్క‌డా రెస్పాన్స్ బాగుంది

అత్త - అల్లుడు.. ఈ కాన్సెప్ట్‌తో గ‌తంలో వ‌చ్చిన చిత్రాల‌న్నింటికి భిన్నంగా రూపొందిన సినిమా 'అత్తారింటికి దారేది'. అత్త‌తో వెకిలి చేష్ట‌ల‌ స‌న్నివేశాలు, అలాంటి నేప‌థ్యంలోనే సాగే పాట‌లు.. ఇవేవి లేకుండా ఈ మూవీ తెర‌కెక్కి ఇండ‌స్ట్రీ హిట్‌గా నిలిచింది. మేన‌త్త‌ని అమ్మ త‌రువాత అమ్మ‌గా భావించే ఓ యువ‌కుడి క‌థగా రూపొందిన ఈ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌.. తాజాగా క‌న్న‌డంలోకి 'ర‌న్న' పేరుతో రీమేక్ అయి రిలీజ్ అయింది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ పాత్ర‌లో 'ఈగ' ఫేం సుదీప్ న‌టించిన ఈ సినిమాలో అత్త‌గా మ‌ధుబాల న‌టించింది. హీరోయిన్ల పాత్ర‌ల్లో ర‌చితా రామ్‌, హ‌రి ప్రియ న‌టించారు. గ‌త శుక్ర‌వారం విడుద‌లైన 'ర‌న్న' రికార్డు స్థాయి క‌లెక్ష‌న్ల‌తో బాక్సాఫీస్ వ‌ద్ద సంద‌డి చేస్తోంద‌ని అక్క‌డి ట్రేడ్ వ‌ర్గాలు చెప్పుకొస్తున్నాయి.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.