English | Telugu

అందాల న‌టి ఆర్తి అగ‌ర్వాల్ క‌న్నుమూత‌

నువ్వు నాకు న‌చ్చావ్ చిత్రంతో క‌థానాయిక‌గా ఎంట్రీ ఇచ్చిన అందాల న‌టి ఆర్తి అగ‌ర్వాల్ క‌న్నుమూశారు. స్థూల‌కాయ స‌మ‌స్య‌తో ఆమె గ‌త కొంత‌కాలంగా బాధ‌ప‌డుతున్నార‌ని.. లైఫోస‌క్ష‌న్ ఆప‌రేష‌న్ కోసం అమెరికా వెళ్లిన ఆమె.. ఆ ఆప‌రేష‌న్ విక‌టించ‌డంతో మ‌ర‌ణానికి గుర‌య్యార‌ని స‌మాచారం. చిన్న వ‌య‌సులోనే అప్ప‌టి టాప్ హీరోలంద‌రితోనూ జోడీ క‌ట్టి మెప్పించిన ఆర్తి అగ‌ర్వాల్‌.. అంతే చిన్న వ‌య‌సులోనే క‌న్ను మూవ‌య‌డం విచార‌క‌రం. నువ్వు నాకు న‌చ్చావ్‌, నువ్వు లేక నేను లేను, ఇంద్ర‌, వ‌సంతం, నేనున్నాను, సంక్రాంతి, అందాల రాముడు, గోరింటాకు వంటి చిత్రాలు మంచి విజ‌యం సాధించి ఆర్తికి న‌టిగా మంచి పేరును తీసుకువ‌చ్చాయి. ఆర్తి ఆక‌స్మిక మృతికి సినీ ప్ర‌ముఖులు షాక్‌కి గుర‌య్యారు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.