English | Telugu
'జిల్' విలన్ ఫుల్ బిజీ
Updated : Jun 8, 2015
ఛోటా నాయక్.. అంటూ 'జిల్' సినిమాలో విలనిజాన్ని పండించిన కబీర్ దుహన్ సింగ్ గుర్తున్నాడుగా. తన స్టైలీష్ లుక్‌తో ఆ సినిమాకి ఫ్రెష్‌నెస్ తీసుకురావడమే కాకుండా.. 'జిల్' ఎట్రాక్షన్స్ లో తన ప్రెజెన్స్‌ని ఒకటిగా నిలిపాడు కబీర్. గోపీచంద్‌తో ఢీ అంటే ఢీ అనే ఆ పాత్ర కబీర్ కి తెలుగులో ఎనలేని గుర్తింపుని తీసుకువచ్చింది. అతి త్వరలో రానున్న రవితేజ 'కిక్ 2'లోనూ నెగెటివ్ రోల్ ప్లే చేస్తున్న ఈ డైనమిక్ విలన్.. కొత్త చిత్రాలకు సైన్ చేయడంలో ఫుల్ బిజీ అవుతున్నాడని ఫిల్మ్ నగర్ వర్గాలు తెలుపుతున్నాయి. బాలకృష్ణ 99వ చిత్రం 'డిక్టేటర్'లోనూ.. అలాగే సునీల్ హీరోగా వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలోనూ కబీర్ విలన్ గా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. 'శౌర్యం' శివ తమిళంలో రూపొందిస్తున్న అజిత్ కొత్త చిత్రంలోనూ కబీర్ ప్రతినాయకుడుగా నటిస్తున్నాడు. మొత్తమ్మీద.. దక్షిణాదికి కబీర్ సింగ్ రూపంలో మాంచి విలన్ దొరికేసాడు. బకరా విలన్ క్యారెక్టర్‌లను కాకుండా పవర్‌ఫుల్ విలన్ రోల్స్‌ను అతను ఎంచుకుంటే గనుక.. సౌత్ లో బెస్ట్ విలన్‌గా కబీర్ గుర్తింపు తెచ్చుకుంటాడనడంలో అతిశయోక్తి లేదు.