English | Telugu

పూరీ ఆగలేకపోతున్నాడట..!!

ఒకప్పుడు హీరోల కొడుకులే హీరోలయ్యేవాళ్లు. కానీ ఇప్పుడు దర్శకులు, ఇతర టెక్నీషియన్స్‌ల కొడుకుల టార్గెట్‌ కూడా హీరో కావడమే. డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ కొడుకు పూరి ఆకాశ్‌ హీరో అవుతాడని చిన్నప్పుడే తేలిపోయింది. బాలనటుడిగా చాలా సినిమాల్లో నటించిన ఆకాశ్‌.. మధ్యలో ‘ధోని’ సినిమాలో లీడ్‌ రోల్‌ చేశాడు.

ఇప్పుడు అతను కథానాయకుడిగా ‘ఆంధ్రా పోరి’ ప్రేక్షకుల ముందుకొచ్చింది. తొలి రోజు కొడుకు సినిమా చూడలేకపోయిన పూరి.. రెండో రోజు థియేటర్‌కే కొడుకు నట విన్యాసాలు చూశాడట. నా కొడుకు అదరగొట్టేశాడంటూ ఆనందంగా చెబుతున్నాడు పూరి.

"ఆంధ్రాపోరి మరాఠీ మాతృక చూసినపుడు అందులో కథానాయకుడు చాలా బాగా చేశాడని.. అంతకంటే బాగా చేయాలని ఆకాశ్‌కు చెప్పా. ఐతే ఆంధ్రాపోరిలో ఆకాశ్‌ నటన చాలా సంతృప్తికరంగా అనిపించింది. క్లైమాక్స్‌ సీన్‌లో ఆకాశ్‌ చాలా మంచి ఎక్స్‌ప్రెషన్స్‌ ఇచ్చాడు. నిజానికి ఆకాశ్‌ను మూడేళ్ల తర్వాత హీరోగా ఇంట్రడ్యూస్‌ చేద్దామనుకున్నా. కానీ ఈ సినిమా చూశాక అర్జెంటుగా అతడు హీరోగా సినిమా చేయాలనిపిస్తోంది. ఆంధ్రాపోరి మంచి లవ్‌స్టోరీ రాజ్‌ మాదిరాజు చాలా బాగా తీశాడు. మంచి మెసేజ్‌ కూడా ఇచ్చాడు” అని చెప్పాడు పూరి.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.