ఈ సంక్రాంతికి 'సూపర్' వార్
మహేష్‌బాబు, పవన్ కల్యాణ్.. తెలుగు చిత్రసీమకు రారాజులుగా వెలిగిపోతున్నారు. పారితోషికం విషయంలోనూ, క్రేజ్ విషయంలోనూ, అభిమానగణం విషయంలోనూ ఎవ్వరికీ ఎవ్వరూ తీసిపోరు. వీరి సినిమాలు విడుదల అవుతున్నాయంటే బాక్సాఫీసుకు పండగే. అలాంటిది మహేష్, పవన్ ఇద్దరూ ఒకేసారి బాక్సాఫీసు దగ్గర ఢీ కొట్టుకొంటే ఎలా ఉంటుంది...?