English | Telugu
ఐదోసారి పెళ్లి చేసుకుంటున్న ఆదా శర్మ
Updated : Jun 8, 2015
ఒకసారి కాదు.. రెండు సార్లు కాదు.. ఏకంగా ఐదోసారి పెళ్లి కూతురైంది హార్ట్ ఎటాక్ బ్యూటీ ఆదాశర్మ. అయితే ఇదేదో రియల్ లైఫ్‌కి సంబంధించి అనుకునేరు. కానే కాదు. రీల్ లైఫ్ కోసం ఇలా ఐదోసారి పెళ్లికూతురుగా మారింది ఆదా. ఇప్పటివరకు ఈ అమ్మడు చేసిన సినిమాల సంఖ్య తక్కువే అయినా.. వాటిలో ఏదో ఒక సన్నివేశంలో ఇలా వధువుగా సందడి చేసింది. 'హార్ట్ ఎటాక్', 'హసీ తో ఫసీ' (హిందీ), 'రణ విక్రమ (కన్నడ), 'సన్నాఫ్ సత్యమూర్తి'.. చిత్రాలలో ఇలా పెళ్లికూతురు వేషాల్లో కనిపించింది ఆదా. తాజాగా మరో సినిమాలోనూ బ్రైడ్ లుక్‌తో కనిపించనున్నట్లు ఆదా ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. ఈ రోజు మరోసారి పెళ్లి చేసుకోబోతున్నాను. ఇలా పెళ్లికూతురు అవడం ఐదోసారి అనే అర్థం వచ్చేలా ట్విట్టర్‌లో రాసుకొచ్చింది ఈ అమ్మడు. ఇంతకీ అది ఏ సినిమా కోసమో మాత్రం మెన్షన్ చేయలేదు ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం 'క్షణం', 'గరమ్', 'సుబ్రమణ్యం ఫర్ సేల్' చిత్రాల్లో ఆదా నటిస్తోంది. వాటిలో ఏదో ఒక సినిమాకి సంబంధించి ఈ లుక్ ఉండొచ్చంటున్నాయి సినీ వర్గాలు.