English | Telugu

Bigg Boss 8 Telugu : బేబక్క నిఖిల్ మధ్య గొడవ.. యష్మీని లాగిపెట్టి కొట్టాలనిపించింది!

బిగ్ బాస్ సీజన్ 8 లో ప్రతీరోజు ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంది. అయితే హౌస్ లో జరిగిన టాస్క్ లలో గెలిచిన మూడు టీమ్ లు.. నైనిక , నిఖిల్, యష్మీ టీమ్. అయితే హౌస్ లో వీరి మధ్య ఎన్నో మిస్ అండర్ స్టాండ్స్ వస్తున్నాయి. అవేంటో ఓసారి చూసేద్దాం.

ఎప్పటిలానే కిచెన్‌లో బేబక్కపై సోనియా సెటైర్లు వేసింది. దీంతో తన చీఫ్ అయిన నిఖిల్‌ వైపు బేబక్క చూసినా మనోడు ఏం పట్టించుకోలేదు. దీంతో అక్కడి నుంచి పక్కకెళ్లిపోయి నిఖిల్‌తో గొవడ పెట్టుకుంది బేబక్క. ఎందుకు అస్తమానం సోనియాకే సపోర్ట్ చేస్తావ్.. తనే ప్లేయర్‌లా కనిపిస్తుందా.. మేము కామా.. అంటూ బేబక్క గొడవేసుకుంది. ఇక వీళ్ల గొడవ మధ్యలో మణికంఠ కూడా కాసేపు దూరాడు. మొత్తానికి నిఖిల్ నువ్వు ముందు ఉన్నట్లు లేవని మాస్క్ వేసుకున్నావంటూ బేబక్క ఫైర్ అయింది.

ఇక తర్వాత కిచెన్‌లో నైనిక టీమ్‌కి నిఖిల్ ఏదో సాయం చేస్తుండగా యష్మీ అక్కడికి వెళ్లింది. ఏంటి వీళ్లకి సాయం చేస్తున్నావ్.. ఈ పని వాళ్లే చేయాలని చెప్పింది. దీనికి నిఖిల్ కూడా గట్టిగానే ఆన్సర్ ఇచ్చాడు. నాకు సాయం చేయాలనుకున్నప్పుడు ఎవరికైనా చేస్తా అంటూ నిఖిల్ అన్నాడు. అంటే నువ్వు బిగ్‌బాస్ ఆర్డర్లు కూడా లెక్కచేయవా అని యష్మీ చెప్పింది. కాసేపటికి అభయ్ దగ్గరికెళ్లిన నిఖిల్.. యష్మీ గురించి చెప్తూ ఫుల్ ఫైర్ అయ్యాడు. అసలు యష్మీ బిహేవియర్ చూస్తుంటే లాగి పెట్టి కొట్టాలనిపించింది.. నాకు టెంపర్ లేచింది.. పోతే పోయింది షో.. ఇందాక వెజిటేబుల్స్ క్లీన్ చేసి కుకింగ్ చేయడానికి వెళ్తుంటే.. బాత్‌రూంలో కాసేపు పెట్టి తీసుకొస్తా అప్పుడు వండండి అంటూ తిక్కతిక్కగా మాట్లాడుతుందని నిఖిల్ చెప్పాడు. యష్మీకి నిఖిల్ కి మధ్య కోల్డ్ వార్ సాగుతుంది. అటు బేబక్కకి నిఖిల్, ఇటు యష్మీకి నిఖిల్ మధ్య గొడవ జరుగుతుంది. వీరిలో ఎవరు కరెక్టో మీరే కామెంట్ చేయండి.

Sanjana Gets Zero Points: జీరోగా సంజన.... హౌస్ మేట్స్ ఏకాభిప్రాయంతో జైల్లోకి!

బిగ్ బాస్ సీజన్-9 చివరి దశకి వచ్చింది. సోమవారం రోజు నో నామినేషన్ అని బిగ్ బాస్ చెప్పాడు. కొన్ని పాయింట్స్ గల బాక్స్ లని గార్డెన్ ఏరియాలో పెట్టాడు. అందులో జీరో నుండి రెండున్నర లక్షల వరకు నెంబర్ గల బాక్స్ లు ఉంటాయి. ఎన్ని పాయింట్స్ కి ఎవరు అర్హులో వారికి ఆ పాయింట్స్ గల బాక్స్ ఇవ్వాలి.. పై నుండి ఎవరు అయితే ముందుగా బాల్ పట్టుకుంటారో వాళ్ళకే మనీ పాయింట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు ఇచ్చే పాయింట్స్ ని హౌస్ మేట్స్ ఇద్దరు అంగీకరించాలి.. కనీసం ఇద్దరు కూడా అంగీకరించకపోతే ఆ పాయింట్స్ అతనికి రద్దు అవుతాయని బిగ్ బాస్ చెప్తాడు...