English | Telugu

Karthika Deepam2 : దీప కోసం ప్రాణాల మీదకి తెచ్చుకున్న కార్తీక్...

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -145 లో....దీప కూరగాయలు కట్ చేస్తుంటే.. అప్పుడే నరసింహా వస్తాడు. వీడేందుకు వచ్చాడు అనుకుంటున్నావా అని నర్సింహా అనగానే.. నీడలాగా వెంటాడుతున్నావని తెలుసు.. వంట చేసుకొని నాలుగు డబ్బులు సంపాదించుకుంటున్నాను.. వెళ్లిపో గొడవ చెయ్యకని దీప అనగానే.. ఈ సోది అంతా నాకు అవసరం లేదు.. ఆ ఇంటి పత్రాలు ఇస్తావా ఇవ్వవా అని నరసింహా అడుగుతాడు.

అది మా నాన్న ఆస్తి.. నేను ఇవ్వనని దీప అనగానే.. ఎలా ఇవ్వవో నేను చూస్తాను. నీ అడ్డు తొలగిస్తానంట దీపని నరసింహా కత్తితో పొడవబోతుంటాడు. అప్పుడే కార్తీక్ వచ్చి అడ్డుగా ఉండడంతో కత్తి కార్తీక్ కి గుచ్చుకుంటుంది. ఎలాగు వచ్చావ్ కదా.. నిన్ను చంపేస్తా అని నరసింహా అంటాడు. దాంతో కత్తిపీట తీసుకొని దీప నరసింహా పైకి వెళ్తుంది. దాంతో నరసింహా భయపడి పారిపోతాడు. ఆ తర్వాత కార్తీక్ ని హాస్పిటల్ కి తీసుకొని వెళ్తుంది దీప. అప్పుడే పెళ్లి గురించి ఇరు కుటుంబాలు మాట్లాడుకుంటారు. కార్తీక్ కి కాంచన ఫోన్ చేస్తుంది. కార్తీక్ ఫోన్ దీప లిఫ్ట్ చేస్తుంది. దీప ఏడుస్తుంటే ఎందుకు ఏడుస్తున్నావ్ దీప అని కాంచన అనగానే సుమిత్ర ఫోన్ తీసుకొని ఏమైందని అడుగుతుంది. దాంతో దీప జరిగింది చెప్తుంది. దాంతో సుమిత్రతో సహా అందరు షాక్ అవుతారు. అందరూ వెంటనే హాస్పిటల్ కి బయలుదేర్తారు.

మరొకవైపు జ్యోత్స్న ఫ్రెండ్స్.. ఇంకా మీ బావ రావట్లేదంటు మాట్లాడేసరికి జ్యోత్స్నకి కోపం వస్తుంది. కార్తీక్ కి ఫోన్ చేయగా.. దీప లిఫ్ట్ చేసి జరిగింది మొత్తం చెప్తుంది. జ్యోత్స్న షాక్ అవుతుంది. తను కూడా హాస్పిటల్ కి బయలుదేర్తుంది. ఆ తర్వాత సుమిత్ర వాళ్ళు హాస్పిటల్ కి వెళ్తారు. అసలేం జరిగిందో దీప అందరికి చెప్తుంది. నరసింహా గురించి పోలీసులతో మాట్లాడాలని శ్రీధర్, దశరథ్ లు అనుకుంటారు. డాక్టర్ వచ్చి కార్తీక్ సిచువేషన్ సీరియస్ గా ఉందని చెప్పడంతో.. అందరు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Sanjana Gets Zero Points: జీరోగా సంజన.... హౌస్ మేట్స్ ఏకాభిప్రాయంతో జైల్లోకి!

బిగ్ బాస్ సీజన్-9 చివరి దశకి వచ్చింది. సోమవారం రోజు నో నామినేషన్ అని బిగ్ బాస్ చెప్పాడు. కొన్ని పాయింట్స్ గల బాక్స్ లని గార్డెన్ ఏరియాలో పెట్టాడు. అందులో జీరో నుండి రెండున్నర లక్షల వరకు నెంబర్ గల బాక్స్ లు ఉంటాయి. ఎన్ని పాయింట్స్ కి ఎవరు అర్హులో వారికి ఆ పాయింట్స్ గల బాక్స్ ఇవ్వాలి.. పై నుండి ఎవరు అయితే ముందుగా బాల్ పట్టుకుంటారో వాళ్ళకే మనీ పాయింట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు ఇచ్చే పాయింట్స్ ని హౌస్ మేట్స్ ఇద్దరు అంగీకరించాలి.. కనీసం ఇద్దరు కూడా అంగీకరించకపోతే ఆ పాయింట్స్ అతనికి రద్దు అవుతాయని బిగ్ బాస్ చెప్తాడు...