English | Telugu

బెజవాడ బేబక్క బిగ్ బాస్ రెమ్యునరేషన్ ఎంతంటే!

బిగ్ బాస్ సీజన్ 8లో తొలి వికెట్ పడింది. అందరూ అనుకున్నట్టుగానే బెజవాడ బేబక్కని ఇంటికి పంపించేశారు. గతంలో బిగ్ బాస్ హౌస్‌కి ఉన్న సెంటిమెంట్‌ని ఫాలో అవుతూ.. బేబక్కకి తొలివారంలో అన్యాయం చేస్తూ ఎలిమినేట్ చేసి పారేశారు. అయితే హౌస్ లో ఏం జరిగినా బేబక్క మాత్రం ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ అయి బయటకొచ్చింది.

బేబక్క హౌస్ లో ఉంది వారం రోజులే అయినా తనకి లక్ష యాభై వేల వరకు రెమ్యునరేషన్ అందిందని తెలుస్తోంది. అయితే తను కిచెన్ లో డ్యూటీ చేయడమే పెద్ద మైనస్ గా మారింది. నామినేషన్ అనేది బిగ్ బాస్ హౌస్ లో కీలకం. అందులో పృథ్వీ తనని అన్ ఫిట్ అంటూ నామినేషన్ చేసినప్పుడు పెద్దగా పట్టించుకోలేదు. ఇంకా హౌస్ లో తనకన్నా చిన్నవాళ్ళు ఉన్నప్పటికి సోనియాతో గొడవని తగ్గించుకోలేకపోయింది. నిఖిల్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని తనే ఒప్పుకోవడం.. సరైన ఎంటర్‌టైన్మెంట్ ఇవ్వలేకపోవడంతో బేబక్కకి ఓటింగ్ తక్కువగా పడింది. తర్వాతి వారం నుండి ఆడాలని ఆదివారం నాటి ఎపిసోడ్ లో నాగార్జునతో అన్న బేబక్క ఇప్పుడు ఎలిమినేట్ అయి బయటకొచ్చింది.

బిగ్ బాస్ హౌస్ లోకి పద్నాలుగు మంది కంటెస్టెంట్స్ రాగా బేబక్క ఎలిమినేషన్ తో ఇప్పుడు పదమూడు మంది కంటెస్టెంట్స్ మాత్రమే మిగిలారు. సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ గా అడుగుపెట్టిన బేబక్క పాజిటివ్ టాక్ తోనే బయటకు వచ్చేసింది. హౌస్ లో నుండి బేబక్క ఎలిమినేట్ అయి బయటకు వస్తుంటే కిర్రాక్ సీత, శేఖర్ బాషా, విష్ణుప్రియ బాగా ఎమోషనల్ అయ్యారు.

Sanjana Gets Zero Points: జీరోగా సంజన.... హౌస్ మేట్స్ ఏకాభిప్రాయంతో జైల్లోకి!

బిగ్ బాస్ సీజన్-9 చివరి దశకి వచ్చింది. సోమవారం రోజు నో నామినేషన్ అని బిగ్ బాస్ చెప్పాడు. కొన్ని పాయింట్స్ గల బాక్స్ లని గార్డెన్ ఏరియాలో పెట్టాడు. అందులో జీరో నుండి రెండున్నర లక్షల వరకు నెంబర్ గల బాక్స్ లు ఉంటాయి. ఎన్ని పాయింట్స్ కి ఎవరు అర్హులో వారికి ఆ పాయింట్స్ గల బాక్స్ ఇవ్వాలి.. పై నుండి ఎవరు అయితే ముందుగా బాల్ పట్టుకుంటారో వాళ్ళకే మనీ పాయింట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు ఇచ్చే పాయింట్స్ ని హౌస్ మేట్స్ ఇద్దరు అంగీకరించాలి.. కనీసం ఇద్దరు కూడా అంగీకరించకపోతే ఆ పాయింట్స్ అతనికి రద్దు అవుతాయని బిగ్ బాస్ చెప్తాడు...