English | Telugu

Eto Vellipoyindhi Manasu : అగ్నిసాక్షిగా తను నేను తాళి కట్టిన భార్య.. నా కుటుంబం జోలికి రావొద్దు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -196 లో.....మీరు ఆస్తి కోసం ఎంతకైనా తెగిస్తారని అర్థమవుతుంది.. ఇదంతా చేసింది మీరే అని నాకు తెలుసని శ్రీలతతో రామలక్ష్మి అంటుంది. నేనే అనడానికి సాక్ష్యం ఏముంది? అనవసరంగా నిందలు వెయ్యకని శ్రీలత అంటుంది. ఆ బ్రేక్ లు తీయడం శ్రీలతకి తెలియకుండా‌ సందీప్ చేసాడు. అయ్యో అత్తయ్యకి విషయం తెలిస్తే ఎలా అంటు శ్రీవల్లి టెన్షన్ పడుతుంది. మరొకవైపు సీతాకంత్ కోపంగా నందిని దగ్గరికి వెళ్తాడు.

అసలు నువ్వు ఎం చేస్తున్నావు.. నీకు అర్ధమవుతుందా.. నీ ప్రేమని దక్కించుకోవడానికి ఏదైనా చేస్తావని తెలుసు.. మరి ఇలా చేస్తావనుకోలేదు.. నీ ప్రేమ కోసం నా భార్య అడ్డు తొలగించాలనుకున్నావంటూ సీతాకాంత్ నందినిపై కోప్పడుతాడు. నువ్వేం అంటున్నావో అర్థం కావడం లేదని నందిని అంటుంది. నోరు ముయ్.. రామలక్ష్మి నేను బయటకు వెళ్తుంటే మీటింగ్ అంటూ నన్ను వద్దని చెప్పి తనని చంపాలని చూసావని సీతాకాంత్ అంటాడు. రామలక్ష్మి అగ్నిసాక్షిగా నేను తాళి కట్టిన భార్య.. తనకి ఏదైనా అయితే నేను తట్టుకోలేను.. ఇప్పుడేం కాలేదు కాబట్టి నిన్ను వదిలేస్తున్నాను.. నా జోలికి.. నా కుటుంబం జోలికి రాకని నందినికి సీతాకాంత్ వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు.

మరొకవైపు రామలక్ష్మికి ఆక్సిడెంట్ గురించి శ్రీవల్లి, సందీప్ మాట్లాడుకుంటారు. అప్పుడే శ్రీలత వస్తుంది. ఎందుకు ఇలా చేసావ్ టైమ్ బాలేక దొరికపోతే పరిస్థితి ఏంటని సందీప్ తో శ్రీలత అంటుంది. మరొకవైపు రామలక్ష్మికి డాక్టర్ వచ్చి ట్రీట్ మెంట్ ఇస్తుంది. ఆ తర్వాత సీతాకాంత్ దగ్గరుండి చూసుకుంటాడు. నా దగ్గర వచ్చి పడుకోమని రామలక్ష్మిని శ్రీలత పిలుస్తుంది.‌ అవసరం లేదు తనని నేనే చూసుకోవాలని సీతాకాంత్ అంటాడు. ఆ తర్వాత ఒకవేళ నువ్వే అలా చేసావా అని నందినిని హారిక అడుగుతుంది. నువ్వు కూడా అలా అంటావేంటని నందిని అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Sanjana Gets Zero Points: జీరోగా సంజన.... హౌస్ మేట్స్ ఏకాభిప్రాయంతో జైల్లోకి!

బిగ్ బాస్ సీజన్-9 చివరి దశకి వచ్చింది. సోమవారం రోజు నో నామినేషన్ అని బిగ్ బాస్ చెప్పాడు. కొన్ని పాయింట్స్ గల బాక్స్ లని గార్డెన్ ఏరియాలో పెట్టాడు. అందులో జీరో నుండి రెండున్నర లక్షల వరకు నెంబర్ గల బాక్స్ లు ఉంటాయి. ఎన్ని పాయింట్స్ కి ఎవరు అర్హులో వారికి ఆ పాయింట్స్ గల బాక్స్ ఇవ్వాలి.. పై నుండి ఎవరు అయితే ముందుగా బాల్ పట్టుకుంటారో వాళ్ళకే మనీ పాయింట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు ఇచ్చే పాయింట్స్ ని హౌస్ మేట్స్ ఇద్దరు అంగీకరించాలి.. కనీసం ఇద్దరు కూడా అంగీకరించకపోతే ఆ పాయింట్స్ అతనికి రద్దు అవుతాయని బిగ్ బాస్ చెప్తాడు...