నిప్పులు చిమ్మే సూర్యుడి మధ్యన మర్యాద పురుషోత్తముడు!
శ్రీ రామ జన్మ భూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అధికారికంగా రిలీజ్ చేసిన రామజన్మభూమి లోగో ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. హనుమజ్జయంతి సందర్భంగా ట్రస్ట్ ఈ లోగో ను రిలీజ్ చేసింది. ప్రకాశిస్తున్న సూర్యుడి మధ్యలో శ్రీరాముడు కనిపించేలా ఆకర్షణీయంగా లోగో ను రూపొందించారు. ఎరుపు, పసుపు, కాషాయ రంగులతో ఈ లోగో కు మరింత వన్నె తెచ్చారు.